Begin typing your search above and press return to search.

ప్ర‌గ్య లైఫ్ లో ఊహించ‌ని ఆ మ‌లుపు

By:  Tupaki Desk   |   24 April 2021 9:30 AM GMT
ప్ర‌గ్య లైఫ్ లో ఊహించ‌ని ఆ మ‌లుపు
X
ప్ర‌గ్య జైశ్వాల్ నిరంత‌ర ఇన్ స్టా ట్రీట్ ఫ్యాన్స్ లో హాట్ టాపిక్. వ‌రుస బికినీ షూట్లు.. మ్యాగ‌జైన్ షూట్ల‌తో విరుచుకుప‌డ‌డం ప్ర‌గ్య ప్ర‌త్యేక‌త‌. ఇటీవ‌ల స్పోర్ట్స్ బ్రాండ్స్ కి ప్ర‌మోష‌న్ చేసింది. ఇక యోగా జిమ్మింగ్ వీడియోల‌తోనూ ప్ర‌గ్య త‌న అభిమానుల‌కు ట‌చ్ లో ఉంది.

తాజాగా ప్ర‌గ్య మ‌రో స్పెష‌ల్ ఫోటోషూట్ ని షేర్ చేసింది. నేవీ బ్లూ డెనిమ్ జీన్స్ .. వంగ పువ్వు రంగు టీష‌ర్ట్ ధ‌రించి ప్ర‌గ్య స్టైలిష్ గా ఫోజిచ్చింది. సింపుల్ గా క‌నిపిస్తున్నా స్టైలిష్ లుక్ తో ప్ర‌గ్య జైశ్వాల్ ఆక‌ట్టుకుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో అభిమానుల్లో వైర‌ల్ గా మారింది.

టాలీవుడ్ లో పెద్ద కెరీర్ కోసం ఎంతో ఓపిగ్గా వేచి చూసిన ఈ భామ‌కు ఇటీవ‌లే మంచి బ్రేక్ ల‌భిస్తోంది. బాలీవుడ్ లో స‌ల్మాన్ భాయ్ స‌ర‌స‌న అవ‌కాశం అందుకుంది. ఇటు తెలుగులోనూ ప‌వ‌న్ క‌ల్యాణ్ చిత్రంలో న‌టిస్తోంద‌న్న ప్ర‌చారం ఉంది. చాలా కాలం వేచి చూసినందుకైనా ఈ సారి అకాశాల్ని స‌ద్వినియోగం చేసుకుంటుంద‌నే భావిద్దాం.