Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ః ప్రగ్యా కిల్లింగ్ ఫోజ్ ఇచ్చి విష్‌ చేసింది

By:  Tupaki Desk   |   9 March 2021 8:30 AM GMT
ఫొటోటాక్‌ః ప్రగ్యా కిల్లింగ్ ఫోజ్ ఇచ్చి విష్‌ చేసింది
X
కంచె సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్‌ ఆ తర్వాత ఆశించిన స్థాయిలో ఆఫర్లు దక్కించుకోలేక పోయింది. ఇన్నేళ్లు అయినా పెద్ద సినిమా లు లేక పోయినా.. పెద్ద సక్సెస్‌ లు దక్కక పోయినా కూడా ప్రగ్యా జైస్వాల్‌ మాత్రం ఇంకా జనాల్లో నానుతూ ఉంది అంటే అది ఖచ్చితంగా సోషల్‌ మీడియా వల్లే అనడంలో సందేహం లేదు. క్రమం తప్పకుండా తన హాట్ ఫొటోలను షేర్‌ చేస్తూ ఉండే ప్రగ్యా జైస్వాల్‌ అడపా దడపా సినిమాలు చేస్తూ కెరీర్‌ లో అలా అలా ముందుకు సాగుతోంది.

మహిళ దినోత్సవం సందర్బంగా ప్రగ్యా జైస్వాల్‌ ఈ హాట్‌ ఫొటోను షేర్‌ చేసి అందరికి శుభాకాంక్షలు తెలియజేసింది. నేను ఒక మహిళను.. నీలో ఉన్న సూపర్‌ పవర్‌ ఏంటీ అనే విషయాన్ని గుర్తించు అన్న సందేశంతో ప్రగ్యా ఈ బ్లాక్ అండ్ వైట్ షేడ్ లో ఉన్న హాట్‌ ఫొటోను షేర్‌ చేసింది. ఈ ఫొటోలో ప్రగ్యా జైస్వాల్‌ లుక్ కిల్లింగ్ గా ఉందంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఆమె షేర్‌ చేసిన ఈ ఫొటో జనాల దృష్టిని ఆకర్షించింది. కొన్ని గంటల్లోనే వేల లైక్స్ మరియు కామెంట్స్ ను దక్కించుకుంది.