Begin typing your search above and press return to search.

సైరాలో కంచె సుందరి

By:  Tupaki Desk   |   4 Sept 2017 12:05 PM IST
సైరాలో కంచె సుందరి
X
టాలీవుడ్ లో చారిత్రాత్మక చిత్రాల హవా మొదలైనట్లే కనిపిస్తోంది. హాలీవుడ్ తరహలో మనవాళ్ళు భారీ యుద్ధాలను రాజుల రాజసన్ని తలపించేలా కోటలను ఎంతో కళాత్మకంగా తెరపై చూపిస్తున్నారు. దర్శకులు కూడా అందుకోసం చాలా కష్టపడుతున్నారు. ముఖ్యంగా నటి నటుల విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. చిన్న పాత్రలకైనా స్టార్ హోదా ఉన్న యాక్టర్స్ ని కథతో మెప్పించి మరీ సెలెక్ట్ చేసుకుంటున్నారు.

కొంత మంది స్టార్స్ కూడా చారిత్రాత్మక చిత్రంలో చిన్న పాత్ర వచ్చినా చాలు అని స్ర్కీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇక అదే తరహాలో మెగా స్టార్ హీరోగా భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న "సైరా" లో కూడా చాలా మంది ప్రముఖులు నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎవరి పాత్ర ఏమిటో దర్శకుడు సురేందర్ రెడ్డి ఫిక్స్ చేసుకున్నాడట. అయితే మరికొన్ని పాత్రలకు ఇంకా ఎవరిని ఫైనల్ చేయలేదట చిత్ర యూనిట్. ఇంకొంతమంది స్టార్స్ ని ఈ సినిమాలో సెలెక్ట్ చేయనున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ ని సెలెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు మళ్లీ మరో నటి పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. కంచె సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్ సాయుధ పోరాటం లో ఉయ్యాలవడ నరసింహ రెడ్డి తో కలవనుందని టాక్.

ఒక వేళ ఈ సినిమాలో ప్రగ్యా కి ఛాన్స్ దొరికితే ఆమె అదృష్ట వంతురాలనే చెప్పాలి. ఎందుకంటే ప్రగ్యా కి కంచె సినిమా తర్వాత మంచి హిట్ అందుకోలేదు. దాదాపు ఆమె కనిపించిన సినిమాలలో సెకండ్ హీరోయిన్ గానే కనిపిస్తోంది. ఇక అందాలను కూడా గట్టిగానే ఆరబోస్తోంది. మరి "సైరా" లో ఈ అమ్మడు నటిస్తుందో లేదో తెలియాలంటే అధికారికంగా తెలిపే వరకు వెయిట్ చేయాల్సిందే.