Begin typing your search above and press return to search.

వీడియో : అఖండ బ్యూటీ కష్టం చూడండి

By:  Tupaki Desk   |   21 Nov 2021 3:30 PM GMT
వీడియో : అఖండ బ్యూటీ కష్టం చూడండి
X
హీరోలు హీరోయిన్ లు మంచి ఫిజిక్ ను మెయింటెన్ చేయడం కోసం ఖచ్చితంగా చాలా కష్టపడాల్సి ఉంటుంది. నోరు కట్టుకుని.. కడుపు మాడ్చుకుని ఉండటంత పాటు రెగ్యులర్ గా గంటల తరబడి వర్కౌట్స్ చేస్తూనే ఉండాలి. అలా చేయకుంటే ఏం అవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోయిన్స్‌ చూడ్డానికి నాజూకుగా అనిపించినా వారు చాలా కష్టం పడుతూ ఉంటారు. సమంత చేసే వర్కౌట్ వీడియోలను మనం చాలా సార్లు చూశాం. ఇంకా చాలా మంది ముద్దుగుమ్మలు వర్కౌట్స్ కూడా చూశాం. సోషల్ మీడియాలో ఆ వీడియోలు రెగ్యులర్ గా వైరల్‌ అవుతూనే ఉంటాయి. తాజాగా ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

చూడ్డానికి చక్కగా స్మూత్ గా కనిపించే ప్రగ్యా వర్కౌట్ స్టైల్ చూస్తే అవాక్కవ్వాల్సిందే. రెగ్యులర్ గా ఈ అమ్మడు తన హాట్‌ ఫొటో షూట్స్‌ ను షేర్‌ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈసారి మాత్రం ఈ అమ్మడు తన వర్కౌట్ వీడియోను షేర్‌ చేసింది. తాను అంత హాట్ గా అందంగా కనిపించడం వెనుక ఎంత కష్టం దాగి ఉందో ఆమె చెప్పకనే చెప్పింది. మంచి ఫిజిక్ మాత్రమే కాకుండా ఆమె మంచి నటన ప్రతిభ కలిగిన హీరోయిన్. అయితే అదృష్టం కలిసి రాకపోవడంతో ఎక్కువగా ఆఫర్లు దక్కడం లేదు. తెలుగు లో ఈ అమ్మడు ముందు ముందు మరిన్ని సినిమాలు చేస్తుందేమో చూడాలి.

తాజాగా ఈ అమ్మడు అఖండ సినిమాలో హీరోయిన్‌ గా నటించింది. మరి కొన్ని రోజుల్లో ఆ సినిమా రాబోతుంది. బాలయ్యకు జోడీగా ఈ అమ్మడి నటన అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. అఖండ సినిమా చిత్రీకరణ మొదలు ఈమె లుక్ కోసం అభిమానులు వెయిట్‌ చేశారు. ఇటీవలే ప్రగ్యా అఖండ లుక్ ను రివీల్‌ చేశారు. కంచె సినిమాలో ఎలా అయితే ఉందో అలాగే ఇంకా అఖండలో కూడా కనిపిస్తుందని కామెంట్స్ వచ్చాయి. ఇంత వర్కౌట్ చేస్తే ఇప్పటి వరకు ఏంటీ మరో పదేళ్ల వరకు కంచె లుక్ లోనే ఉంటుందని అభిమానులు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.