Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: నల్లకలువ స్టైలు చూడతరమా!

By:  Tupaki Desk   |   14 Oct 2019 10:41 AM GMT
ఫోటో స్టోరీ: నల్లకలువ స్టైలు చూడతరమా!
X
'కంచె' సినిమాతో తెలుగు తెరపైకి వచ్చిన భామ ప్రగ్య జైస్వాల్. మొదటిసినిమాతో మంచి గుర్తింపు సాధించిన ఈ భామకు ఆ తర్వాత మంచి ఆఫర్లే వచ్చాయి కానీ ఆ సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరిచాయి. గత కొంతకాలంగా ఆఫర్లు కూడా తగ్గాయి. అయితే ఈ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా ప్రగ్య సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతోంది. రెగ్యులర్ గా ఏదో ఒక హాట్ ఫోటో పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఉడికించడం అనేది ముఖ్యమైన పనిగా పెట్టుకుంది.

ఇక అలాంటి విజన్.. మిషన్ ఫైనలైజ్ చేసుకుంటే యాక్షన్స్ కూడా దానికి తగ్గట్టే ఉంటాయి. ఈభామ ప్రస్తుతం యూరోప్ ట్రిప్ లో ఉంది. అక్కడ హాలిడేని ఎంజాయ్ చేస్తూ పనిలో పనిగా సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. అందుకు శాంపిల్ గా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "ఒక మహిళలా వ్యవహరించండి.. ఒక బాస్ లాగా ఆలోచించండి" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ క్యాప్షన్లోనే వింటేజ్ లుక్ అని కూడా వెల్లడించింది. కోటు లాగా కనిపిస్తున్న బ్లాక్ కలర్ గౌన్ ధరించి..వెడల్పాటి బెల్టు.. మోకాళ్ళ వరకూ ఉన్న పొడవాటి బూట్లతో బాల్కనీలో నిలుచుంది. డార్క్ కలర్ లిప్ స్టిక్.. స్టైలిష్ యాటిట్యూడ్ ను రంగరించడంతో లేడీ బాస్ లాగే కనిపిస్తోంది.

ఈ డ్రెస్ షీన్ క్లోతింగ్ బ్రాండ్ వారిదని కూడా వెల్లడించింది. అలా అయితే ఇది పెయిడ్ పోస్ట్ అయ్యే అవకాశం ఉంది. నెటిజన్లకు పెయిడ్ పోస్టా.. మరొకటా అనే విషయంతో సంబంధం ఉండదు కదా? అందుకే ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు. "హాట్ లేడీ లుక్".. "కాలా జాదూ".. "వింటేజ్ లుక్ ఝకాస్" అంటూ తమా స్పందన తెలిపారు. ఇక సినిమాల విషయానికి వస్తే 'ఆచారి అమెరికా యాత్ర' తర్వాత మరో ఆఫర్ రాలేదు.