Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: చీతా గౌన్లో మెస్మరైజ్ చేస్తోందే

By:  Tupaki Desk   |   27 April 2019 1:30 AM GMT
ఫోటో స్టొరీ: చీతా గౌన్లో మెస్మరైజ్ చేస్తోందే
X
ప్రగ్య జైస్వాల్ పేరు వినగానే తెలుగు ప్రేక్షకులకెవరికైనా 'కంచె' సినిమా గుర్తొస్తుంది. ఆ సినిమాలో సీత పాత్రలో నటించి అందరినీ మెప్పించింది ప్రగ్య. ఆ సినిమా తర్వాత రెండుమూడు సినిమాల్లో నటించినా అవి విజయం సాధించలేదు. దీంతో ప్రగ్య కెరీర్ ఇప్పుడు నత్తనడకన సాగుతోంది. అయితే ఈ భామ సోషల్ మీడియాలో ఇతర హాట్ హీరోయిన్ల లాగానే చెలరేగిపోతోంది.

తాజాగా ప్రగ్య తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. చిరుతపులి చర్మం డిజైన్ ఉన్న గౌన్ ధరించి ఒక డెడ్లీ పోజిచ్చింది. వెనక్కు తిరిగి నిలబడిన ప్రగ్య తన మొహం మాత్రం కెమెరాకు కనపడేలా ఇటు తిరిగింది. షార్ట్ గౌన్ కావడం తో ఆమె టోన్డ్ లెగ్స్ అందంగా కనిపిస్తున్నాయి. లూజ్ హెయిర్.. డార్క్ కలర్ లిప్ స్టిక్ తో హాట్ గా కనిపిస్తోంది. ఎలాంటి అందగత్తెలైనా సహజంగా అన్నియాంగిల్స్ లో చూడడానికి అందంగా ఉండరు. కొందరు ఫ్రంట్ నుంచి చూస్తే బాగుంటారు. కొందరేమో వెనక నుంచి చూస్తే బాగుంటారు. కానీ ఈ కంచె బూటి మాత్రం.. సారీ.. కంచె బ్యూటీ మాత్రం ఏ యాంగిల్ లో అయినా అందంగానే ఉంటోంది. ఇది నిజంగానే రేర్ క్వాలిటీ.

అందుకేనేమో నెటిజనులు ఈ ఫోటోకు ఫుల్ గా మెస్మరైజ్ అయ్యారు. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తూ లైకుల మీద లైకులు కొట్టారు. ఒక నెటిజనుడు ప్రగ్యను 'లేడీ చీతా డాన్' అన్నాడు. మరొకర్ 'కిల్లర్ పోజ్' అన్నాడు. ఇక ప్రగ్య సినిమాల గురించి మాట్లాడుకుంటే 'ఆచారి అమెరికా యాత్ర' తర్వాత ఇప్పటివరకూ ప్రగ్యకు చెప్పుకోదగ్గ ఆఫర్లు రాలేదు. మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'సైరా' లో ఒక కీలక పాత్రలో నటిస్తోంది. కన్నడలో 'కురుక్షేత్ర' అనే మరో సినిమాలో కూడా నటిస్తోంది.