Begin typing your search above and press return to search.

కంచె మరో ప్రపంచానికి తీసుకెళ్లింది- ప్రగ్య

By:  Tupaki Desk   |   19 Oct 2015 1:30 PM GMT
కంచె మరో ప్రపంచానికి తీసుకెళ్లింది- ప్రగ్య
X
అక్టోబర్ 22 రిలీజ్ అవుతున్న వరుణ్ తేజ్ మూవీ కంచె. క్రిష్ డైరెక్షన్ వహించిన ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటించింది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యం మెయిన్ థీమ్ గా రూపొందిన ఈ సినిమాలో.. రాచ కుటుంబానికి చెందిన యువతిగా యాక్ట్ చేస్తోంది ప్రగ్య.

కంచె తనను ఓ విభిన్న ప్రపంచంలోకి తీసుకెళ్లిందంటోంది ప్రగ్య జైస్వాల్. "1930కాలానికి చెందిన యువతిగా నటిస్తున్నాను. విభిన్న కాలానికి నన్ను ఈ సినిమా తీసుకెళ్లింది. షూటింగ్ పూర్తయ్యాక తిరిగి సాధారణ జీవితంలోకి రావడానికి నాకు కొంత సమయం పట్టిందంటోంది ప్రగ్య.

ఈ ప్రాజెక్ట్ లో తాను ఇన్వాల్వ్ అయిపోయానని, ఇంటి దగ్గర ఉన్నపుడు కూడా ఆ పాత్ర ప్రభావం ఉండేదంటోంది ముద్దుగుమ్మ. బొట్టుబిళ్లలు పెట్టుకోవడం గమనించి.. ఏమన్నా సమస్య ఉందా అని అడిగేదట ప్రగ్యా వాళ్లమ్మ. వరుణ్ తేజ్ కు జంటగా నటించడం చాలా సౌకర్యవంతంగా ఉండేదని, పాత్రకు సంబంధించి అన్నీ క్రిష్ చెప్పినట్లుగా ఫాలో అయిపోవడంతో.. సులభంగా పూర్తి చేయగలిగామని చెప్పింది ప్రగ్యా జైస్వాల్.