Begin typing your search above and press return to search.

మెగా హీరోతో అలా ప‌ట్టేశా

By:  Tupaki Desk   |   12 Sep 2015 9:30 AM GMT
మెగా హీరోతో అలా ప‌ట్టేశా
X
ప్ర‌స్తుతం ఏ నోట విన్నా కంచె టీజ‌ర్ గురించే ఈ టీజ‌ర్‌ లో వ‌రుణ్‌ తేజ్ వార్ గురించి, అస‌లు సినిమా తెర‌కెక్కిన బ్యాక్‌ డ్రాప్ గురించి చిలువ‌లు ప‌లువలుగా ముచ్చ‌ట్లాడుకుంటున్నారు. ఇదే సినిమాతో ముంబై మోడ‌ల్, మిస్ ఇండియా కాంటెస్టెంట్ ప్ర‌గ్యా జైశ్వాల్ క‌థానాయిక‌గా నటిస్తోంది. ఇప్పటికే మిర్చిలాంటి కుర్రోడు - ఓ కన్నడ - ఓ హిందీ సినిమాలో హీరోయిన్‌ గా చేసిన ఈ భామ.. అసలు మెగా క్యాంపులోకి ఎలా ఎంట్రీ ఇచ్చిందంటే...

అప్ప‌ట్లో అక్ష‌య్ కుమార్ స‌ర‌స‌న గబ్బ‌ర్ ఆడిష‌న్స్‌ కి వెళ్లా. అక్క‌డ ద‌ర్శ‌కుడు క్రిష్ ప‌రిచ‌యం అయ్యారు. అయితే కార‌ణం ఏదైనా న‌న్ను మాత్రం ఎంపిక చేసుకోలేదు. అలా మొద‌టి ఛాన్స్ మిస్స‌య్యా. వ‌న్ ఫైన్ డే తెలుగు సినిమా కంచె కి ఎంపిక‌య్యావ్ అంటూ క్రిష్ నుంచి ఫోన్ వ‌చ్చింది. ఎగిరి గంతేశాను. అస‌లు నేను ఇంత వేగంగా హీరోయిన్‌ ని అవుతాన‌నుకోలేదు. కానీ స‌ర్‌ ప్రైజ్‌. మా కుటుంబ నేప‌థ్యంలో స్టార్లు ఎవ‌రూ లేరు. మా వాళ్లంతా అక‌డెమీషియ‌న్స్‌. బాగా చ‌దువుకున్న‌వాళ్లే... కావ‌డంతో నేను కూడా ఏ డాక్ట‌రో - ఇంజినీరో అవుతాన‌నుకున్నా. అస‌లు షో బిజ్ గురించి కానీ మోడ‌లింగ్ గురించి కానీ నాకు ఏ ఆస‌క్తి లేదు. కానీ స్నేహితురాళ్ల ప్రోత్సాహంతో అందాల పోటీల‌కు వెళ్లా. మిస్ ఇండియా పోటీల్లో మిస్ ఫ్రెష్ ఫేస్ అవార్డు ద‌క్కించుకున్నా. త‌ర్వాత మోడ‌ల్‌ గా ఛాన్సొచ్చింది. ఇప్పుడు ఏకంగా ఓ మెగా హీరో సినిమాలో న‌టించేస్తున్నా అంటూ డీప్‌ గా డీటెయిల్స్ రివీల్‌ చేసింది. .

ఇప్పుడ‌ర్థ‌మైందా? ఎవ‌రి ఫేట్ ఎప్పుడు ఎలా మారిపోతుందో చెప్ప‌లేం. కృష్ణాన‌గ‌ర్‌, ఫిలింన‌గ‌ర్‌ లో అవ‌కాశాల కో్సం ట్రై చేస్తున్న పాప‌లూ.. మీరు కూడా ప్ర‌గ్యాలా ఛాన్స్ కొట్టేయొచ్చు. అంత‌వ‌ర‌కూ వెయిట్ చేయండి మ‌రి!