Begin typing your search above and press return to search.

శామ్ బాబాయ్ కి.. ప్రగ్య అబ్బాయ్ కి

By:  Tupaki Desk   |   17 Sep 2015 5:42 PM GMT
శామ్ బాబాయ్ కి.. ప్రగ్య అబ్బాయ్ కి
X
క్రిష్ డైరెక్షన్ లో నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ నటించిన కంచె ఆడియో ఫంక్షన్ లో హైలైట్స్ చాలానే ఉన్నా.. హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. సినిమాలో వరుణ్ తేజ్ తో రొమాన్స్ చేసిన ప్రగ్య.. నడుం వయ్యారాలను ఆరబోస్తూ.. నాభి కిందకి డ్రస్ వేసుకొచ్చి ఫ్యాన్స్ ని ఖుషీ చేసింది.

ఖుషీ అంటే గుర్తొచ్చింది.. అప్పట్లో అత్తారింటికి దారేది ఆడియో ఫంక్షన్ లో సమంత కూడా ఇంతలాగే నాభి ప్రదర్శన చేసింది. ఈ సారి వరుణ్ తేజ్ మూవీ కోసం ప్రగ్య అందాలు కుమ్మరించింది. ఆన్ స్క్రీన్ లో అందాలు ఆరబోయడం మామూలు విషయమే కానీ.. ఇలా ఫంక్షన్లలోనూ కట్టిపడేసేలా కట్టూబొట్టూ ధరించడం అరుదుగా జరిగేదే. మరి అప్పట్లో సమంత నడుం అందాలు బాబాయ్‌ ఫంక్షన్‌ లో ఎలా హాట్‌ టాపిక్‌ అయ్యాయో ఇప్పుడు ప్రగ్యా అందాలు కూడా అంతే.. అబ్బాయ్‌ ఫంక్షన్‌ లో అందరూ తెగ చెప్పకున్నారు. మరి అదే రేంజులో సినిమా కూడా అత్తారింటికి దారేది మాదిరి హిట్టయితే చాలు.

ఇకపోతే ఆడియో వేడుకలో బాబాయ్ పవన్ గురించి మాట్లాడాడు అబ్బాయ్ వరుణ్ తేజ్. మూవీ రిలీజ్ అయ్యాక.. సినిమా తీసుకెళ్లి బాబాయ్ కి చూపిస్తాడట. ఎలా ఉందో అభిప్రాయం అడుగుతాడట. ఈ మెగా కుర్రోడంటే.. పవన్ కి చాలా ఇష్టంలెండి. ఏవో కొన్ని ఈక్వేషన్స్ సెట్ కావడం లేదు కానీ.. వరుణ్ కి సంబంధించిన అన్ని అప్ డేట్స్‌ పైనా ఆరా తీసేంతటి అటాచ్ మెంట్ ఉంది ఇద్దరి మధ్యలో.