Begin typing your search above and press return to search.

వీడియో : ప్రగతి గారు మీ ఎనర్జీ సూపర్‌ అండీ..!

By:  Tupaki Desk   |   29 Oct 2021 12:30 AM GMT
వీడియో : ప్రగతి గారు మీ ఎనర్జీ సూపర్‌ అండీ..!
X
చిన్న వయసులోనే తనకంటే పెద్ద వయసు హీరోలకు మరియు హీరోయిన్స్ కు తల్లి పాత్రల్లో నటించిన క్యారెక్టర్‌ ఆర్టిస్టు ప్రగతి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అమ్మ పాత్రల్లో అత్త పాత్రల్లో అక్క పాత్రల్లో ఆమె సూట్‌ అయినంతగా మరెవ్వరు సూట్‌ అవ్వరేమో అనిపించేంతగా ఆమె నటించి మెప్పించిన సందర్బాలు ఉన్నాయి. కరోనా లాక్ డౌన్ కు ముందు వరకు ప్రగతి అంటే ఒక పద్దతైన మహిళ.. నిండుగా చీర కట్టులో కనిపించే ఒక అమ్మ పాత్ర గుర్తుకు వచ్చేది. కాని లాక్ డౌన్ సమయంలో ప్రగతి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన వీడియోలు మరియు ఫొటోలు ఆమె ఇమేజ్ ను కొంత మార్చాయి. ఆమె వర్కౌట్‌ వీడియోలు మరియు ఫొటోలు మరియు జిమ్‌ కాస్ట్యూమ్స్ లో ఆమె అందం గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు.

ఆమద్య రెగ్యులర్ గా సోషల్‌ మీడియాలో నిలిచిన ప్రగతి ఆ తర్వాత కూడా మంచి పాత్రల్లో కనిపిస్తూ ఆకట్టుకుంది. తాజాగా మరోసారి ఆమె తన ఒక వీడియో తో వైరల్‌ అవుతోంది. ప్రగతి ఇటీవల రోడ్డు మీద ఊరేగింపులో వేసిన మాస్ డాన్స్ అందరి దృష్టిని ఆకర్షించింది. బాబోయ్‌ మరీ ఇంత రచ్చ డాన్స్ ఏంటీ మేడమ్‌ అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ప్రగతి స్వయంగా ఈ వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్‌ చేశారు. ఇలాంటి సందర్బంగా మీకు వస్తే ఖచ్చితంగా వదులుకోకండి. మీరు కూడా ఇలాంటి మాస్ స్టెప్పులు వేయండి అన్నట్లుగా కామెంట్‌ పెట్టింది. మొత్తానికి ప్రగతి చేసిన ఈ మాస్ తీన్మార్ స్టెప్పులు మరియు ఆమె ఎక్స్ ప్రెషన్స్ గురించి సోషల్‌ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు.

సహజంగా అయితే సోషల్‌ మీడియాలో ఇలాంటి ఫొటోలు మరియు వీడియోలను ఎక్కువగా షేర్‌ చేశారు. కాని ప్రగతి మాత్రం ఎలాంటి డౌట్ లేదు అన్నట్లుగా ఈ వీడియోను షేర్‌ చేసిన తనలోని మాస్ యాంగిల్ ను చూపించింది. ఆమద్య జిమ్‌ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోలను షేర్‌ చేసిన ప్రగతి ఇప్పుడు ఈ వీడియోలను షేర్‌ చేసి మరోసారి తన ఎనర్జిని చూపించే ప్రయత్నం చేసింది. చాలా మంది ప్రగతి గారు మీ ఎనర్జీ సూపర్‌ అండీ అంటూ కితాబిస్తున్నారు.