Begin typing your search above and press return to search.

వీడియో : ప్రగతి ఇప్పటికి ఆ సినిమాలు చేయగలదు

By:  Tupaki Desk   |   30 Nov 2020 12:30 PM GMT
వీడియో : ప్రగతి ఇప్పటికి ఆ సినిమాలు చేయగలదు
X
చిన్న వయసులోనే సీనియర్‌ హీరోలకు కూడా తల్లిగా నటించిన ప్రగతి ఈమద్య కాలంలో సోషల్‌ మీడియాలో చాలా ట్రెండ్‌ అయ్యింది. ఇప్పటి వరకు ఆమె వయసు గురించి ఆమె లుక్‌ గురించి ఒక అంచనాతో ఉన్న వారికి ఈ లాక్‌ డౌన్‌ లో ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఫొటోలు మరియు వీడియోలతో షాక్‌ ఇచ్చింది. ఆమె మోడ్రన్‌ లుక్‌ తో పాటు ఆమెలోని కొత్త యాంగిల్‌ ను చూపించింది. ఆమె వర్కౌట్స్‌ చేస్తూ ఉన్న వీడియోలు మరియు మాస్‌ డాన్స్‌ వీడియోలు ఆమెను కొత్తగా చూపించాయి.

హీరోలకు అమ్మగా.. అత్తగా చాలా పద్దతి అయిన పాత్రల్లో చాలా పెద్ద వయస్కురాలిగా కనిపించిన ప్రగతి ఇలా కూడా కనిపిస్తుందా అంటూ ముక్కున వేలేసుకున్నారు. మరోసారి ప్రగతి తనలోని కొత్త యాంగిల్‌ ను ప్రదర్శించింది. లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేయాలని కెరీర్‌ ఆరంభంలో చాలా కోరుకున్న ప్రగతికి ఆ అవకాశం ఇప్పుడైనా ఇవ్వొచ్చు అన్నట్లుగా ఈ వీడియోను చూస్తుంటే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రగతి తాజా వీడియోలో కర్రను తిప్పి తన పైకి వచ్చే వారిని కొట్టిన తీరు సూపర్‌ అంటూ కామెంట్స్‌ వస్తున్నాయి. ఆమె ఒక ప్రొఫెషనల్‌ కర్రసామి అభ్యాసకురాలి మాదిరిగా కర్రను తిప్పింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.


వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : https://www.instagram.com/p/CII9m0BnR4S/?utm_source=ig_web_copy_link