Begin typing your search above and press return to search.

వాళ్లే పిలిచినా నేను వెళ్లను : ప్రగతి

By:  Tupaki Desk   |   20 Aug 2020 2:30 PM GMT
వాళ్లే పిలిచినా నేను వెళ్లను : ప్రగతి
X
స్టార్‌ హీరోల సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కనిపించి మెప్పించిన నటి ప్రగతి ఈమద్య కాలంలో సోషల్‌ మీడియాలో కాస్త హడావుడి ఎక్కువగా చేస్తున్నారు. స్టార్‌ హీరోలకు తల్లి పాత్రలో నటించి చాలా హుందాగా కనిపించిన ఆమె సోషల్‌ మీడియాలో మాత్రం చాలా ట్రెండీ లుక్‌ లో కనిపించి ఈమె ఆమేనా అన్నట్లుగా అనిపించేలా ప్రగతి వీడియోలు చేసింది. దాంతో ఈమె బిగ్‌ బాస్‌ ఆఫర్‌ కోసం ఇలాంటి జిమిక్కులు చేస్తుందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.

సోషల్‌ మీడియాలో ప్రగతి చేస్తున్న వీడియోలు పబ్లిసిటీ కోసం అని ఆ పబ్లిసిటీ బిగ్‌ బాస్‌ ఎంట్రీ కోసం అంటూ నెట్టింట ప్రచారం జరిగింది. తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 ఆరంభంకు అంతా సిద్దం అయ్యింది. ఈ సమయంలో ప్రగతి కంటెస్టెంట్‌ గా ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. ఇంతకు ముందే ఫేమ్‌ లేని వారు తమ గురించి ప్రేక్షకుల్లో అభిప్రాయంను మార్చుకోవాలనుకున్న వారు డబ్బుకు ఆశ పడే వారు మాత్రమే బిగ్‌ బాస్‌ కు వెళ్తారు. కాని అందులో నాకు ఏ ఒక్కటి అవసరం లేదు అంది.

ఫేమ్‌ నాకు ఇప్పటికే ఉంది.. నాకు ప్రేక్షకుల్లో మంచి పేరు ఉంది ఇక డబ్బు విషయంలో నాకు పట్టింపు లేదు కనుక నేను బిగ్‌ బాస్‌ కు వెళ్లాలనుకోవడం లేదు అంటూ చెప్పుకొచ్చింది. అయినా మళ్లీ ప్రచారం జరుగుతూనే ఉన్న నేపథ్యంలో మరోసారి ప్రగతి స్పందించింది. నేను బిగ్‌ బాస్‌ లో పాల్గొనబోవడం లేదు. అవన్నీ రూమర్స్‌ మాత్రమే. ఒకవేళ వాళ్లే వచ్చి నన్ను అడిగినా కూడా ఆసక్తి లేదని చెప్పేస్తాను. అందువల్ల పుకార్లు ఆపేయండి అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.