Begin typing your search above and press return to search.

గొంతు సవరిస్తున్న ఇండియన్ జాక్సన్

By:  Tupaki Desk   |   19 Sep 2015 4:47 AM GMT
గొంతు సవరిస్తున్న ఇండియన్ జాక్సన్
X
ఇండియాలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరంటే.. ప్రభుదేవా అని ఎవరైనా చెబ్తారు. మొదట డ్యాన్సర్ గా జర్నీ స్టార్ట్ చేసి, డ్యాన్స్ డైరెక్టర్ గా ఎదిగి, హీరోగా మారిన ప్రభుదేవా.. బాలీవుడ్ లో డైరెక్టర్ గానూ టర్న్ తీసుకున్నాడు. ఇప్పుడు లేటెస్ట్ గా సింగర్ అవతారం ఎత్తుతున్నాడు ప్రభుదేవా.

తను తీస్తున్న లేటెస్ట్ మూవీ సింగ్ ఈజ్ బ్లింగ్ లో ఓ పాట పాడేస్తున్నాడు. అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన సింగ్ ఈజ్ కింగ్ కి సీక్వెల్ గా చెబ్తున్న ఈ చిత్రం రికార్డింగ్ టైంలో... సరదాగా ఓ పాటకి గొంతు సవరించుకున్నాడట ప్రభుదేవా. కొన్ని సీక్వెన్స్ లకు బ్యాక్ గ్రౌండ్ గా వచ్చే వాయిస్ లకూ.. ప్రభు వాయిస్ రికార్డ్ చేశారట. డిఫరెంట్ గా ఉండడమే కాకుండా... సిట్యుయేషన్ కి సరిగ్గా మ్యాచ్ కావడంతో... ప్రభు వాయిస్ ని ఫైనల్ ఔట్ పుట్ లోనూ ఉంచాలని డిసైడ్ అయ్యాడు మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ శిరోద్కర్. దీనికి హీరో నుంచి కూడా పర్మిషన్ వచ్చింది.

రీమేక్ డైరెక్టర్ గా హిట్లు కొట్టిన ప్రభుదేవా.. డైరెక్ట్ కంటెంట్ విషయంలో ఫెయిలయ్యాడు. సింగ్ ఈజ్ బ్లింగ్ తో తాను ఒరిజినల్ కంటెంట్ ని కూడా పర్ఫెక్ట్ డీల్ చేయగలనని నిరూపించుకునేందుకు కష్టపడుతున్నాడు ప్రభుదేవా. అందులో భాగంగానే ఈ కొత్త ప్రయోగాలు కూడా. ఇండియన్ మైకేల్ జాక్సన్ అనే పేరుకు తగ్గట్టుగా.. డ్యాన్సర్ కం సింగర్ అయిపోతున్నాడు ప్రభుదేవా.