Begin typing your search above and press return to search.

ప్రభుదేవా ఆ రేంజులో విసిగిస్తాడనమాట

By:  Tupaki Desk   |   5 Jun 2016 11:30 AM GMT
ప్రభుదేవా ఆ రేంజులో విసిగిస్తాడనమాట
X
''నేను అభినేత్రి సినిమా కోసం చాలా పెద్ద హెల్ప్ చేశాను. నా వలన దర్శకుడు విజయ్‌ కు చాలా ప్లస్సు పాయింట్‌ అయ్యింది. ఎందుకంటే నేను ఈ సినిమాకు అన్నీ మూసుకుని పనిచేశాను. నా అతి అంతా పక్కనెట్టేశాను. ఎందుకంటే నాక్కూడా ఒక బ్రేక్‌ కావాలి'' అంటూ చెప్పుకొచ్చాడు ఇండియా మైఖేల్‌ జాక్సన్ గా పేరొందిన ప్రభు దేవా. మనోడు చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు తెలుగు రాష్ట్రంలలో పడుతున్న సైక్లోన్ వానలను తలిపిస్తున్నాయి.

ముంబయ్‌ వెళితే డైరక్టర్ ను అనిపిస్తుందని.. అదే హైదరాబాద్‌ లో అడుగుపెడితే డ్యాన్స్ మాష్టర్‌ గా ఫీలవుతుంటా అని చెబుతూనే.. తాను కూల్‌ గా ఉండలేనని.. సెట్‌ లో అయితే భారీగా విరుచుకుపడుతుంటానని చెప్పుకొచ్చాడు. నిజానికి ప్రభు దేవా ఓ రేంజులో విసిగిస్తాడని ఎప్పటినుండో టాక్‌ ఉంది. మనోడు తెలుగులో డైరక్టర్ గా సెట్టవ్వకపోవడానికి ఇదే కారణం అని చాలామంది చెబుతుంటారు. టైముకి రాకపోవడం నుండి వచ్చాక అతి చేయడం.. వామ్మో సంపేస్తాడు అని చాలామంది నటీనటులు కూడా వివిధ సందర్భాల్లో ఆఫ్ ది రికార్డ్ చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రభు దేవా ఆ విషయాన్ని ఒప్పుకోవడం కూడా ఇంకా పెద్ద షాకింగ్‌ విషయమే.

అభినేత్రి తమిళ వెర్షన్‌ ను ప్రొడ్యూస్ చేస్తున్న ప్రభుదేవా.. రెండు వర్షన్లలోనూ హీరోగా నటిస్తున్నాడు. ఇక సినిమా కథ మొత్తం తనకు తెలియదని.. ఈ సినిమా కథ కేవలం తమన్నా ఒక్కమ్మాయికే తెలుసునని చెప్పాడు.