Begin typing your search above and press return to search.
#ప్రభాస్ 21.. బీరాలో పోయిన దీపికకు బిగ్ బితో చెక్!
By: Tupaki Desk | 11 Oct 2020 9:30 AM ISTప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో భారీ పాన్ వరల్డ్ (ఇండియా) సినిమా(ప్రభాస్ 21)కి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఓంరౌత్ `ఆదిపురుష్ 3డి`తో పాటు డార్లింగ్ ఈ సినిమాపైనా పూర్తి స్థాయిలో దృష్టి సారించనున్నారు. ఇప్పటికే ఈ మూవీలో దీపిక పదుకొనే కథానాయికగా నటించనుందని ప్రకటించారు నిర్మాత అశ్వనిదత్.
ఇక ప్రభాస్ కి ఈ మూవీతో దాదాపు 100 కోట్ల వరకూ పారితోషికం వాటాల రూపంలో దక్కనుందని మీడియాలో కథనాలు హైలైట్ అయ్యాయి. అలాగే ఆ తర్వాత పెద్ద పారితోషికం ఎవరిది? అంటే... దీపిక పదుకొనేకు 18 కోట్లు ఇచ్చేందుకు నిర్మాత అశ్వనిదత్ అంగీకరించారని కథనాలు వేడెక్కించాయి.
అయితే ప్రభాస్ 21 అని ఈ మూవీకి పేరు పెట్టడం దీపిక పదుకొనేకు నచ్చని సంగతి తెలిసిందే. ప్రభాస్ - లేడీ సూపర్ స్టార్ దీపిక మూవీగా అభిమానులు చూడాలని సోషల్ మీడియాల్లో పంచ్ వేసింది. దీపికలోని ఈగోయిస్టు గురించి డార్లింగ్ అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగడమే గాక.. ఇప్పటికీ తనపై గుర్రుమీదున్నారు.
ఇక తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర పోషించనున్నారని తెలుస్తోంది. నాగ్ అశ్విన్- దత్ బృందం ఇప్పటికే బిగ్ బిని సంప్రదించారని.. ఆయన పాత్ర సినిమా ఆద్యంతం ప్రభాస్ కి ధీటుగా ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు.. ప్రభాస్ తర్వాత దీపిక కంటే అధిక పారితోషికం అందుకునేది బిగ్ బి అంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వేడెక్కిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే దీపిక కు బిగ్ బి రూపంలో చెక్ పెట్టినట్టే. ఈ క్రేజీ ప్రాజెక్టులో దీపికకు ప్రభాస్ - అమితాబ్ తర్వాత మూడో స్థానమే దక్కుతుందనడంలో సందేహమేం లేదు. అయితే ఈ సన్నివేశాన్ని తాను జీర్ణించుకోగలదా లేదా? అన్నది చూడాలి. ఈ మూవీ కోసం అమితాబ్ తెలుగు నేర్చుకునే యోచన చేస్తున్నారని కూడా ఉత్తరాది మీడియా కథనం వెల్లడించింది.