Begin typing your search above and press return to search.

హౌస్ అరెస్ట్ చేసుకున్న ప్రభాస్

By:  Tupaki Desk   |   20 March 2020 9:10 AM GMT
హౌస్ అరెస్ట్ చేసుకున్న ప్రభాస్
X
కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి. రోజురోజుకి కరోనా బాధితులు ఎక్కువైపోతున్నారు. సామన్య ప్రజానీకం దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ కరోనా దెబ్బకు ఇల్లు దాటాలంటేనే పదిసార్లు ఆలోచిస్తున్నారు. పైగా విదేశాల నుంచి వచ్చిన వారు రెండు వారాల పాటు గృహ నిర్బంధంలో ఉండాలని ప్రభుత్వాలు ఇప్పటికే ఆదేశించాయి. దాంతో విదేశాల నుండి వచ్చిన వారంతా ఇంట్లోనే ఉంటున్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రభాస్ తన కొత్త సినిమా షూటింగ్ కోసం జార్జియాకు వెళ్లినప్పుడు ప్రభాస్ అభిమానులు చాలా మంది ఆందోళన చెందారు. పది రోజులు తర్వాత కరోనా నేపథ్యంలో షూటింగ్ ఆపేసి జార్జియా నుండి సురక్షితంగా ఇండియాకి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు తాజాగా ఒక వార్త బయటకి వచ్చింది. కరోనా వ్యాప్తిని దూరం చేసే చర్యలో భాగంగా ప్రభాస్ కూడా తనకు తాను హౌస్ అరెస్ట్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ సందర్భంగా కరోనా వ్యాప్తి నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను తన అభిమానులకు తెలియజేశాడంట. కరోనా విషయంలో అన్ని ప్రభుత్వాలతో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా మరింత అప్రమత్తమవుతున్నాయి. ఇప్పటికే భద్రతా చర్యలతో పాటు కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ప్రజల్లోకి ముమ్మరంగా తీసుకు వెళ్తున్నారు.