Begin typing your search above and press return to search.

న‌ట‌గురువు వైజాగ్ స‌త్యానంద్ తో యంగ్ రెబ‌ల్ స్టార్

By:  Tupaki Desk   |   2 Aug 2021 6:04 AM GMT
న‌ట‌గురువు వైజాగ్ స‌త్యానంద్ తో యంగ్ రెబ‌ల్ స్టార్
X
టాలీవుడ్ లో నేడు స్టార్ హీరోలుగా వెలిగిపోతున్నవారెంద‌రో. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. సూప‌ర్ స్టార్ మ‌హేష్‌.. రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్... మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్.. ఇలా ఎంతో మంది ఉన్నారు. వీళ్లంతా ఈ స్థాయికి చేరుకోవ‌డం వెనుక ఓ గొప్ప గురువు ఉన్నార‌న్న‌ది అతికొద్ది మందికే తెలుసు. ఆయ‌నే వైజాగ్ స‌త్యానంద్. వీళ్లంద‌రూ స‌త్యానంద్ ద‌గ్గ‌రే న‌ట‌న‌లో ఓన‌మాలు నేర్చుకున్నారు. వీరిని స్టార్లుగా తీర్చిదిద్ద‌డంలో స‌త్యానంద్ పాత్ర అసాధార‌ణ‌మైన‌ది. ఇండ‌స్ట్రీలో ఎంత వార‌స‌త్వం ఉన్నా.. ఎలాంటి నేప‌థ్యం ఉన్నా... స‌త్యానంద్ ద‌గ్గ‌ర శిష్య‌రికం చేస్తే సంపూర్ణ న‌టుడిగా త‌యార‌వుతారన్న‌ది ప‌రిశ్ర‌మ సైతం బ‌లంగా న‌మ్ముతుంది.

అందుకే మెగాస్టార్ చిరంజీవి..త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని స‌త్యానంద్ ద‌గ్గ‌ర కి పంపించి న‌ట‌న‌లో ఓన‌మాలు దిద్దించారు. అటుపై స‌త్యానంద్ కి ప‌వ‌న్ ప్రియ శిష్యుడిగా మారిపోయారు. అలాగే మ‌హ‌ష్ కూడా సూప‌ర్ స్టార్ కృష్ణ త‌న‌యుడు అయిన‌ప్ప‌టికీ.. బాలన‌టుడు అయిన‌ప్ప‌టికీ యాక్టింగ్ లో గురువు వ‌ద్ద శిక్ష‌ణ‌తో వృత్తినిబ‌ద్ధ‌త నేర్వాల‌ని స‌త్యానంద్ ని ఎంచుకున్నారు. ఇక `బాహుబ‌లి` సినిమ‌తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్ర‌భాస్ కూడా ఆయ‌న వ‌ద్ద ఓన‌మాలు దిద్దారు.

ఇటీవ‌లే స‌త్యానంద్ జ‌న్మ‌దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ఈ హీరోలంతా ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భాస్ ప్ర‌త్యేకంగా స‌త్యానంద్ తో ఉన్న అనుబంధం ఫోటోల రూపంలో బ‌య‌ట‌ప‌డింది. డార్లింగ్ ప్ర‌భాస్.. త‌న గురువు సత్యానంద్ తో స‌న్నిహితంగా మెలుగుతున్న కొన్ని ఫోటోల్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసి నాటి జ్ఞాప‌కాల్ని స్మ‌రించుకున్నారు. అటుపై తనే స్వ‌యంగా స‌త్యానంద్ పుట్టిన రోజుసంద‌ర్భంగా కేక్ క‌ట్ చేసి సెల‌బ్రేట్ చేసారు ప్ర‌భాస్. అలాగే స‌త్యానంద్ తో కెరీర్ ఆరంభంలో దిగిన ఓ పాత ఫోటోని కూడా డార్లింగ్ షేర్ చేసారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు ఇండ‌స్ట్రీ స‌హ‌చ‌రుల‌తో పాటు ప్ర‌భాస్ అభిమానుల్ని ఆక‌ట్టుకుంటున్నాయి. ``నా శిష్యుడు ఎంత పెద్ద పాన్ ఇండియా స్టార్`` అంటూ స‌త్యానంద్ ఎంతో సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌తో ఈ ఫోటోల‌లో క‌నిపిస్తున్నారు.

స‌త్యానంద్ వ‌ద్ద నేటిత‌రం స్టార్లు అంతా శిక్ష‌ణ తీసుకున్న‌వారే. క‌నీస మెళ‌కువ‌లు నేర్చుకునేందుకు ఆయ‌న వ‌ద్ద శిక్ష‌ణ తీసుకోవ‌డం ప్ర‌తి ఒక్క‌రికి అల‌వాటు. అలా ఆయ‌న అంద‌రికీ న‌ట‌గురువుగా అల‌రారుతున్నారు.