Begin typing your search above and press return to search.

పెదనాన్న రుణం తీర్చుకోబోతున్న ప్రభాస్‌

By:  Tupaki Desk   |   13 Sep 2020 3:45 AM GMT
పెదనాన్న రుణం తీర్చుకోబోతున్న ప్రభాస్‌
X
రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు నట వారసుడిగా ప్రభాస్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్‌ ను తన నట వారసుడు అంటూ కృష్ణం రాజు గతంలో పేర్కొన్నారు. తనను ఆధరించిన వారు ప్రభాస్‌ ను కూడా ఆధరించాలంటూ ప్రభాస్‌ పరిచయం సందర్బంగా కృష్ణంరాజు వ్యాఖ్యలు చేశారు. తనను హీరోగా తీసుకు వచ్చిన పెదనాన్న కృష్ణంరాజు అంటే ప్రభాస్‌ కు ఎనలేని గౌరవం అనడంలో ఎలాంటి సందేహం లేదు. పెదనాన్న మాట జవదాటకుండా ఆయన చెప్పినట్లుగా చేస్తూ ఉంటాడట ప్రభాస్‌. ఇప్పుడు పెదనాన్న రుణం తీర్చుకునేందుకు ప్రభాస్‌ ప్లాన్‌ చేస్తున్నాడట.

బాలీవుడ్‌ లో రూపొందుతున్న ఆదిపురుష్‌ సినిమా ఆ దశాబ్దపు అద్బుతంగా నిలువబోతుందని అంతా అంటున్నారు. కేవలం దశాబ్దంలోనే కాకుండా రాముడి గురించి రూపొందబోతున్న ఈ సినిమా ఎప్పటికి నిలిచి పోయేలా ఉంటుందని అంటున్నారు. అందుకే ఇంతటి గొప్ప సినిమాలో ఎప్పటికి నిలిచి పోయే పాత్రను కృష్ణంరాజుతో వేయిస్తే బాగుంటుందనే అభిప్రాయంలో ప్రభాస్‌ ఉన్నాడు. స్వయంగా దర్శకుడు ఓం రౌత్‌ తో మాట్లాడి తన పెదనాన్న కోసం ఒక పాత్రను ఓకే చేయించాడట. కృష్ణంరాజు పాత్ర చిన్నదే అయినా సినిమాలో అది కీలకంగా చెబుతున్నారు. ఆయన వయసుకు తగ్గ పాత్రను ఇప్పించి ఆదిపురుష్‌ లో భాగస్వామ్యం చేయడం వల్ల ఆయన జీవితంలో మరో గొప్ప సినిమాలో నటించాను అనే సంతృప్తిని కలిగించేలా చేస్తున్నాడు. ఈ విషయమై అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది.