Begin typing your search above and press return to search.

శ్రద్దగా ఎదరుచూస్తున్న ప్రభాస్

By:  Tupaki Desk   |   24 March 2018 7:43 AM GMT
శ్రద్దగా ఎదరుచూస్తున్న ప్రభాస్
X
‘బాహుబ‌లి’ త‌ర్వాత అమాంతం పెరిగిన ఇమేజ్ కార‌ణంగా ప్ర‌భాస్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని ‘సాహో’ సినిమాను మొద‌లుపెట్టాడు. అయితే షూటింగ్ మొద‌లుపెట్టినప్పటి నుంచి అనేక క‌ష్టాలు సాహో టీంను వెంటాడుతున్నాయి. ఇప్పుడు హీరోయిన్ శ్ర‌ద్ధా క‌పూర్ కూడా సాహో షూటింగ్ ఆల‌స్యం అవ్వ‌డానికి ఓ కార‌ణ‌మవుతోంద‌ట‌.

దాదాపు 150 కోట్ల భారీ బ‌డ్జెట్ రూపొందుతున్న ‘సాహో’ చిత్రంలో భారీ యాక్ష‌న్ సీన్ల‌కి కొద‌వే లేద‌ట‌. క్లైమాక్స్‌లో వ‌చ్చే భారీ యాక్ష‌న్ స‌న్నివేశాల‌కే 30 కోట్ల రూపాయ‌ల దాకా ఖ‌ర్చు పెడుతున్నార‌ని టాక్‌. ఈ స‌న్నివేశాల‌ను అబుదాబిలో రిచ్‌గా తెర‌కెక్కించాల‌ని అనుకున్నారు. అయితే సాహో టీంకు షూటింగ్ ప‌ర్మిష‌న్ ఇచ్చేందుకు అబుదాబి ప్ర‌భుత్వం నిరాక‌రించింది. అయితే కాంప్ర‌మైజ్ కాకుండా ప‌ర్మిష‌న్ల కోసం ఎదురుచూసి ఎలాగోలా ప‌ర్మిష‌న్లు సాధించింది చిత్ర బృందం. అయితే షూటింగ్ మొద‌లవ్వ‌డానికి ఆల‌స్యం కావ‌డంతో హీరోయిన్ శ్ర‌ద్ధా క‌పూర్‌, తాను ఇంత‌కుముందే ఒప్పుకున్న బాలీవుడ్ సినిమాల షూటింగ్‌కి వెళ్లిపోయింది. ఓ ప‌క్క సాహో సినిమా చేస్తూనే ‘బ‌ట్టి గుల్ మీట‌ర్ చాలు’ అనే బాలీవుడ్‌ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న శ్ర‌ద్ధా, ఇప్పుడు మ‌రో హిందీ సినిమా ‘స్త్రీ’ షూటింగ్‌ లో ఉంద‌ట‌.

ఈ యాక్ష‌న్ పార్ట్‌ లో హీరోయిన్ కూడా కీల‌కం కావ‌డంతో శ్ర‌ద్ధా కోసం శ్ర‌ద్ధ‌గా ఎదురుచూస్తోంది సాహో టీం. ఇంతకు ముందు ‘బాహుబ‌లి’ సినిమా విష‌యంలో హీరోయిన్ అనుష్క‌కు ఇదే ప‌రిస్థితి ఎదురైంది. కానీ ఆమె ప్ర‌భాస్ సినిమా పూర్తి చేయ‌డం కోసం కొన్ని సినిమాల‌ను వ‌దులుకుంది. అనుష్క‌కి ప్ర‌భాస్ మీద ఉన్న ప్రేమ‌ - బాలీవుడ్ భామ శ్ర‌ద్ధా క‌పూర్‌ కి ఎందుకుంటుంది చెప్పండి!