Begin typing your search above and press return to search.
బర్త్ డే స్పెషల్: ప‌్రభాస్ టాప్ 5 పవర్ ప్యాక్డ్ స్టంట్ సీన్స్
By: Tupaki Desk | 23 Oct 2020 11:45 AM ISTసౌత్ సూపర్ స్టార్ ప్రభాస్ ఈ రోజు (23 అక్టోబర్) బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాల్లో శుభాకాంక్షల తుఫాన్ హోరెత్తుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు డార్లింగ్ కి ప్రత్యేకించి శుభాకాంక్షలు చెబుతుండడం ఆసక్తికరం. గడియారం ముళ్లు అర్ధరాత్రి 12 వద్ద తాకిన వెంటనే...ఈ వెల్లువ మొదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు .. శ్రేయోభిలాషులు వారి హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పడం ప్రారంభించారు. అంతేకాదు.. ప్రభాస్ నటించిన బెస్ట్ సినిమాలేవీ.. బెస్ట్ యాక్షన్ ఎపిసోడ్స్ ఏవీ? అంటూ అభిమానుల్లో డిబేట్ పెట్టుకోవడం ఆసక్తిని కలిగిస్తోంది.
ప్రభాస్ 2002 లో జయంత్ సి. ఫరాంజీ తెరకెక్కించిన యాక్షన్-డ్రామా` ఈశ్వర్`తో సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేదు. అనంతరం 2004 లో విడుదలైన వర్షంతో ప్రభాస్ యాక్షన్ హీరోగా ఎదిగి పరిశ్రమలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
పవర్-ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్స్ .. స్టంట్స్ లో ప్రభాస్ పేరు మార్మోగింది. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి చిత్రంతో అతడి రేంజే మారిపోయింది. ఇండియాలోనే ది బెస్ట్ యాక్షన్ స్టార్ గా తనని తాను ఆవిష్కరించుకున్న ప్రభాస్ కి పాన్ ఇండియా మార్కెట్ ఏర్పడింది. బాహుబలిగా టైటిల్ క్యారెక్టర్ లో నటించిన ప్రభాస్ రాజు కత్తి వాటం చూపించిన తీరు ఉత్తరాది వారికే షాక్ నిచ్చింది. హిందీ బెల్టులో వీరాభిమానుల్ని తెచ్చి పెట్టింది ఈ ఫీట్. ఈశ్వర్ నుంచి మొదలు.. బాహుబలి సిరీస్.. సాహో వరకూ భారీ యాక్షన్ స్టార్ గా ప్రభాస్ తనని తాను మలుచుకున్న తీరు ఆసక్తికరం.
1. బాహుబలి 2: తీర్మానం: రాజమౌళి దర్శకత్వం వహించిన యాక్షన్-డ్రామా ప్రభాస్ భారీ శిల్పాలను ఎత్తడం మొదలు శత్రువు ఎముకలు విరిచేసే విన్యాసాలను చాలా తేలికగా ప్రదర్శించాడు. అంతే కాదు, ప్రభాస్ మహేంద్ర బాహుబలి .. అతని సోదరుడు భళ్లాలదేవ (రానా దగ్గుబాటి పోషించిన) పాత్రతో యుద్ధ సన్నివేశం ప్రేక్షకులను కుర్చీ అంచుపై కూచునేలా చేసింది. బాహుబలి తన తల్లి దేవసేన సృష్టించిన ఫైర్ మీదకు భళ్లాల దేవుడిని విసిరినప్పుడు 9 నిమిషాల యుద్ధ సన్నివేశం హీటెక్కిస్తుంది.
2.సాహో: సుజీత్ రచన దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. ప్రభాస్- శ్రద్ధా కపూర్- జాకీ ష్రాఫ్ - నీల్ నితిన్ ముఖేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం పరిశీలిస్తే.. నరాల్ని మీటే రాకింగ్ అడ్వెంచరస్ విన్యాసాలు యాక్షన్ సన్నివేశాల కారణంగా సంచలనం సృష్టించింది. ట్రక్ ఛేజ్.. బైక్ ఛేజ్ సన్నివేశంలో బైక్ నడుపుతున్న ప్రభాస్ ను అధికారుల బృందం వెంబడిస్తుంటే.. వీక్షకులకు అది చాలా కష్టమైన యాక్షన్ సన్నివేశాలలో ఒకటిగా కనిపిస్తుంది. ఇందులో భారీ వాహనాలు హెలికాప్టర్ ఫాలో అప్ హీటెక్కిస్తుంది. క్లైమాక్స్ లో వీరబలుల్లాంటి వాళ్లను చితక్కొట్టడంలో ప్రభాస్ సాహసం మెంటలెక్కిస్తుంది.
3.రెబల్: తన తల్లిదండ్రులను చంపిన వ్యక్తులు స్టీవెన్ రాబర్ట్‌లను పట్టుకోవటానికి రిషి(ప్రభాస్) ఒక ఉచ్చు పన్నుతాడు. తన ప్రేయసి (తమన్నా భాటియా)ని రాబర్ట్ కిడ్నాప్ చేయడంతో రిషినే విలన్ వలలో పడతాడు. ఈ దృశ్యం రాబర్ట్ ఇంటికి షిఫ్టవుతుంది. అక్కడ రిషి - తమన్నా చేతులు కట్టి నేలమీద కూర్చుని కనిపిస్తారు. అసలు రిషి తల్లిదండ్రులను ఎలా చంపాడనే కథను రాబర్ట్ వివరించినప్పుడు.... రిషి తన కూల్ నెస్ ని కోల్పోతాడు. తరువాత రిషి .... రాబర్ట్ ను ఒకరితో ఒకరు పోరాడదామని సవాల్ విసురుతాడు. అటుపై యాక్షన్ పీక్స్ కి చేరుతుంది. మర్చిపోలేని సీన్ ఇది.
4.చత్రపతి: ప్రభాస్..., శ్రియ శరణ్ నటించిన యాక్షన్-డ్రామా వైజాగ్ లో నివసిస్తున్న శ్రీలంక ప్రజల జీవితం ఆధారంగా రూపొందించారు.. ఒక చిన్న పిల్లవాడు చనిపోయినట్లు చూసి గుండెలు బాదుకున్న ప్రభాస్ భారీ యాక్షన్ సన్నివేశానికి తెర తీస్తుంది. చిన్నారి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి స్థానిక రౌడీలతో పోరాడాలని నిర్ణయించుకుంటాడు. అతను కేవలం విలన్ సైన్యాన్ని కొట్టి వారి నాయకుడిని చంపేస్తాడు. మొత్తం ఎపిసోడ్ చూసిన తరువాత గ్రామస్తులు ఆయనకు ‘చత్రపతి’ అని పేరు పెట్టేస్తారు.
5) బాహుబలి 1.. 2: ప్రభాస్ క్రేజును ఇమేజ్ ను అమాంతం పెంచేసిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ సిరీస్ ఇది. ఇరు సినిమాల్లోనూ భారీ పోరాట దృశ్యాలు అతడి స్థాయిని పెంచాయి. ముఖ్యంగా బాహుబలి క్లైమాక్స్ సీన్.. బాహుబలి 2 పతాక దృశ్యం పీక్స్ అనే చెప్పాలి. ప్రభాస్ లోని రాజును బయటికి తీసిన యాక్షన్ ఎపిసోడ్స్ ని ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఇంకా మర్చిపోలేదంటే అర్థం చేసుకోవచ్చు.
మిర్చి.. మిస్టర్ పర్ఫెక్ట్.. వర్షం లాంటి చిత్రాల్లోనూ భారీ యాక్షన్ ఊపిరాడనివ్వనంత ఉత్కంఠగా కుదిరిందంటే అందుకు ప్రభాస్ రాజు పర్సనాలిటీ ఆ కటౌటే కారణం అని చెప్పొచ్చు.