Begin typing your search above and press return to search.

వ్వాటే ట్విస్టు.. హృతిక్ ని కాద‌ని ప్ర‌భాస్ కి ఛాన్సిచ్చాడా?

By:  Tupaki Desk   |   19 Aug 2020 10:45 AM IST
వ్వాటే ట్విస్టు.. హృతిక్ ని కాద‌ని ప్ర‌భాస్ కి ఛాన్సిచ్చాడా?
X
కొన్ని అవ‌కాశాలు అరుదుగానే వెతుక్కుంటూ వ‌స్తాయి. అలాంటి రేర్ ఛాన్స్ ద‌క్కిన‌ప్పుడు తెలివిగా ఒడిసిప‌ట్టిన‌వాడే తెలివైన వాడు. డార్లింగ్ ప్ర‌భాస్ అలాంటి చాక‌చ‌క్యం ప్ర‌ద‌ర్శించి ఇప్పుడు టాలీవుడ్ లో మ‌రోసారి హాట్ టాపిక్ గా మారాడు. నిన్న‌టిరోజున స‌డెన్ గా తానాజీ ఫేం ఓం రౌత్ తో ప్ర‌భాస్ 22 చిత్రాన్ని ప్ర‌క‌టించిన‌ప్పుడు అంద‌రికీ ఒక‌టే షాక్. ఉన్న‌ట్టుండి ఇలా షాకిచ్చేశాడేమిట‌బ్బా అంటూ పెద్ద డిబేట్ ర‌న్ అయ్యింది.

అయితే ప్ర‌భాస్ కి `ఎ-ఆదిపురుష్‌` అవ‌కాశం ద‌క్క‌డం వెన‌క ఎన్ని ట్విస్టులున్నాయో తెలిస్తే షాక్ తినాల్సిందే. నిజానికి ప్ర‌భాస్ కి ఈ స్క్రిప్టు వినిపించ‌క ముందే హృతిక్ రోష‌న్ ని ఓంరౌత్ సంప్ర‌దించారు. కానీ ఆయ‌న నుంచి స‌రైన స‌మాధానం రాలేదు. త‌న‌కోసం కొద్దిరోజులు వేచి చూడాల్సిందిగా డౌట్ పెట్టేశాడు. దీంతో ఆ త‌ర్వాత ఆ స్క్రిప్టు వేరొక బాలీవుడ్ యువ‌హీరో వ‌ద్ద‌కు వెళ్లింది. కానీ అక్క‌డా కుద‌ర‌లేదు.

చివ‌రికి ఆ స్క్రిప్టునే ప్ర‌భాస్ కి వినిపించాడు ఓం రౌత్. వెంట‌నే ప్రాజెక్ట్ లాకౌంది. ప్ర‌ఖ్యాత టీసిరీస్ ఈ సినిమాని దాదాపు 400కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కించేందుకు ముందుకు రావ‌డంతో ప్ర‌భాస్ మ‌రో పాన్ ఇండియా మూవీకి జాక్ పాట్ కొట్టేసిన‌ట్ట‌య్యింది. అంటే హృతిక్ లాస్ ప్ర‌భాస్ కి గెయిన్ అనే చెప్పాలి. ఈ సినిమాని అటు హిందీ ఇటు తెలుగు స‌హా దేశ విదేశాల్లో ప‌లు భాష‌ల్లో రిలీజ్ చేయ‌నున్నారు. పైగా 3డి సినిమా కాబ‌ట్టి ఈ మూవీ క్రేజు ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నే లేదు.

నిజానికి శ్రీ‌రాముడి పాత్ర‌కు హృతిక్ రోష‌న్ వంద శాతం యాప్ట్. ఆయ‌న‌ను రామాయ‌ణ ఇతిహాస క‌థ‌తో ఇప్ప‌టికే ఓం రౌత్ స‌హా దంగ‌ల్ ఫేం నితీష్ తివారీ కూడా క‌లిసారు. కానీ ఓకే చెప్ప‌లేదు ఎందుక‌నో. ఇక త‌న కార‌ణాలు త‌న‌కి ఉన్నాయి. హృతిక్ కి ఆరోగ్య‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఉన్నాయి. వార్ త‌ర్వాత క్రిష్ 4 చేయాల్సి ఉండ‌గా.. ఎందుక‌నో ఇంకా వేచి చూస్తున్నాడు.