Begin typing your search above and press return to search.

ప్రభాస్ 'ఆది పురుష్' ఎక్స్ క్లూసివ్ సమాచారం...!

By:  Tupaki Desk   |   18 Aug 2020 10:30 AM IST
ప్రభాస్ ఆది పురుష్ ఎక్స్ క్లూసివ్ సమాచారం...!
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరో బిగ్గెస్ట్ సర్‌ ప్రైజ్ ఇచ్చేశారు. 'బాహుబలి' సినిమాతో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న ప్రభాస్ ఇప్పుడు బాలీవుడ్‌ లోకి డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రభాస్ కెరీర్లో 22వ చిత్రంగా రానున్న ఈ మూవీకి 'ఆది పురుష్' అనే టైటిల్ ఖరారు చేసారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓమ్‌ రౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఓమ్ రౌత్ నిర్మాణ సంస్థ సహకారంతో టీ - సిరీస్ భూషణ్ కుమార్ - కృష్ణ కుమార్ - ప్రసాద్ సుతార్ - రాజేష్ నాయర్ లు కలిసి భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'చెడుపై మంచి సాధించిన విజ‌యం' అనే థీమ్‌ తో తెరకెక్కనున్న ఈ మూవీకి సంబంధించిన టైటిల్‌ పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. అందులో రామాయణ ఇతిహాసంలోని రాముడు - హనుమంతుడు - రావణాసురుడి పాత్రలు కనిపిస్తున్నాయి. టైటిల్ పోస్టర్ చూసి ఈ మూవీ కంప్లీట్ రామాయణం బ్యాక్‌ డ్రాప్‌ తో తెరకెక్కబోతున్నట్లు అందరూ ఊహించుకున్నారు.

అయితే మనకు అందిన ఎక్స్ క్లూసివ్ సమాచారం ప్రకారం 'ఆది పురుష్' ప్రాజెక్ట్ రామాయణాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్నప్పటికీ ఇది కంప్లీట్ గా 'రామాయణం' కాదని తెలుస్తోంది. రామాయణంలో ఒక అంశాన్ని తీసుకొని సోషియో ఫాంటసీగా విజువల్ వండర్ గా రూపొందించనున్నారు. అందులోనూ ప్రభాస్ 'రాముడు'గా సినిమాలో కొద్దిసేపు మాత్రమే కనిపించనున్నాడని సమాచారం. హాలీవుడ్ 'ఇండియనా జోన్స్' తరహా ట్రెజర్ హంట్ బ్యాక్‌ డ్రాప్‌ తో చెడుపై మంచి సాధించిన విజ‌యం అనే నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందట. ఇక ఈ సినిమాని సుమారు 450 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నారు. 3 డి ఫార్మాట్ లో విజువల్ వండర్ గా రూపొందించనున్న ఈ చిత్రాన్ని 2021 లో సెట్స్ పైకి తీసువెళ్లి.. 2022 లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రధాన ప్రతినాయకుడి పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోలను సంప్రదిస్తున్నారని సమాచారం. ప్రభాస్ యాక్ట్ చేస్తున్న డైరెక్ట్ హిందీ మూవీ 'ఆది పురుష్'ని తెలుగులో కూడా నిర్మించనున్నారు. దీన్ని తమిళం మలయాళం కన్నడ భాషలలో పాటు అనేక విదేశీ భాషల్లోకి కూడా అనువదించనున్నారని తెలుస్తోంది.

కాగా ప్రస్తుతం ప్రభాస్‌ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధే శ్యామ్‌'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ తరువాత 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ పాన్ ఇంటర్నేషనల్ ఫిలిం చేయనున్నాడు ప్రభాస్. ఈ రెండు ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిన తరువాత ''ఆది పురుష్'' ప్రాజెక్ట్ లో ప్రభాస్ నటించనున్నారు. మొత్తం మీద పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ని కాపాడుకోవడం కోసం ప్రభాస్ వరుసగా భారీ చిత్రాలను ప్లాన్ చేసుకుంటున్నాడని చెప్పవచ్చు.