Begin typing your search above and press return to search.
200 మందికి కరోనా అక్కడ.. ప్రభాస్ డేర్ ఏమిటో!
By: Tupaki Desk | 4 March 2020 2:45 PM ISTఓవైపు కరోనా వైరస్ అల్లకల్లోలం గురించి ఇంటా బయటా గజగజ ఒణికిపోతున్నారు. విమానాశ్రయాలకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి. రెగ్యులర్ ట్రావెలర్స్ సైతం.. ఎటూ వెళ్లకుండా ఇంట్లోనే ముసుగేసుకుని పడుకుంటున్నారు. సెలబ్రిటీల్లో ఈ భయం మరీ ఎక్కువగా ఉంది. ఉన్నది ఒక్కటే జిందగీ! ఎంజాయ్ చేయడానికే ఉన్నదీ! అన్న చందంగా ఉన్నారంతా. ఎవరికి వారు రిస్క్ లేవీ చేసేందుకు సిద్ధంగా లేరు.
ఇలాంటి టైమ్ లో డార్లింగ్ ప్రభాస్ గట్స్ చూస్తుంటే పొగిడేయకుండా ఉండలేం. అతడు మాస్క్‌తో ఫ్రాన్స్ బయలుదేరిన ఫోటోలు కొద్దిసేపటిక్రితం అంతర్జాలంలో వైరల్ గా మారాయి. అసలే ఫ్రాన్స్ (యూరప్) దేశంలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందన్న టాక్ ఉంది. ఇప్పటికే ఆ దేశంలో 200 మందికి కరోనా వైరస్ సోకిందని తేలింది. అలాంటి చోటికి వెళ్లేందుకు డార్లింగ్ ఏమాత్రం భయం లేకుండా ఇలా డేర్ చేయడం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది.
కరోనా భయంతో షూటింగులు ఆపుకుని పలు ప్రొడక్షన్ హౌస్ లు సైలెంట్ అయిపోతే... దేనికీ వెరవక ప్రభాస్ అండ్ యు.వి.క్రియేషన్స్ బృందం ఇలా యూరప్ లో షూటింగులు చేయడం సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం జాన్ చిత్రీకరణ కోసమే ప్రభాస్ ఇలా మొండిగా ఫ్రాన్స్ వెళుతున్నాడు. అయితే డార్లింగ్ కి ఏదైనా జరగకూడనిది జరిగితే! అన్న కంగారూ ఫ్యాన్స్ లో ఉంది. మరి ప్రభాస్ టూర్ వెళుతూ తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నా.. ఏదో ఆందోళన మాత్రం వ్యక్తమవుతోంది. అయితే కొందరు అభిమానులు మాత్రం ప్రభాస్ దమ్మున్న మగాడ్రా.. ఆ దేశం వెళ్లాడంటే...! అంటూ పొగిడేస్తున్నారు. ప్రభాస్ ధైర్యానికి సోషల్ మీడియా జనం తెగ పొగిడేస్తున్నారు. ప్రభాసా? మజాకానా?