Begin typing your search above and press return to search.
'సంచారి' వీడియో సాంగ్: నిజమైన ప్రేమ కోసం ప్రభాస్ అన్వేషణ..!
By: Tupaki Desk | 16 Dec 2021 2:23 PM ISTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - పుజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం ''రాధే శ్యామ్''. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పీరియాడికల్ డ్రామా కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి.
‘రాధేశ్యామ్’ నుంచి తాజాగా 'సంచారి' అనే సరికొత్త పాట వీడియో సాంగ్ విడుదలైంది. 'కొత్త నేలపై కాలి సంతకం.. కొండ గాలితో శ్వాస పంపకం.. సంచారి ఛల్ ఛలో' అంటూ సాగిన ఈ పాట వీక్షకులను విశేషంగా అలరిస్తోంది. జీవితంలో నిజమైన ప్రేమ దొరికే ప్రదేశం కోసం అన్వేషిస్తున్న యువకుడిగా ప్రభాస్ కనిపించారు. నచ్చిన ప్రతీ అమ్మాయికి ప్రపోజ్ చేస్తూ లవర్ బాయ్ గా హ్యాండ్సమ్ లుక్ లో డార్లింగ్ అదరగొట్టేశారు.
యూరప్ వీధుల్లో అందమైన లొకేషన్స్ లో 'సంచారి' పాటను చిత్రీకరించారు. ప్రభాస్ ఇందులో మంచు పర్వతాలలో స్కేటింగ్ చేస్తూ.. ఆకాశంలో డైవింగ్ చేస్తూ కనిపించారు. అలానే కార్ డ్రైవింగ్ - సైక్లింగ్ - హోర్స్ రైడింగ్ చేసి ఆకట్టుకున్నారు. జస్టిన్ ప్రభాకర్ దక్షిణాది బాషల్లో ఈ పాటకు స్వరాలు సమకూర్చారు. తెలుగులో తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఆలపించగా.. కృష్ణకాంత్ (కెకె) దీనికి సాహిత్యం అందించారు. హిందీ వెర్షన్ 'ఉద్ జా పరిందే' పాటకు మిథున్ స్వరాలు సమకూర్చగా.. సింగర్ జూబిన్ పాడారు.
'రాధే శ్యామ్' చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన 'ఈ రాతలే' 'నగుమోము తారలే' పాటలు శ్రోతలను విశేషంగా అలరించాయి. మనోజ్ పరమహంస ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా వర్క్ చేశారు. కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ - గోపీకృష్ణ మూవీస్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందింది. వంశీ - ప్రమోద్ - ప్రసీద నిర్మాతలుగా వ్యవహరించారు.
వింటేజ్ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన 'రాధేశ్యామ్' చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో హస్తసాముద్రిక నిపుణుడు విక్రమాదిత్యగా ప్రభాస్.. ప్రేరణగా పూజాహెగ్డే సందడి చేయనున్నారు. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీతో పాటుగా పలు విదేశీ భాషల్లో ఈ పాన్ ఇండియా సినిమా విడుదల కానుంది.