Begin typing your search above and press return to search.
ఒక్క బాహుబలి 100తో సమానం -ప్రభాస్
By: Tupaki Desk | 23 Oct 2016 9:44 AM ISTబాషా మూవీలో సూపర్ స్టార్ రజినీకాంత్ 'నేనొక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్లే' అంటూ చెప్పిన డైలాగ్ ని.. ఆడియన్స్ ఎవరూ ఎప్పటికీ మర్చిపోరు. ఆ డైలాగ్ ప్లేస్మెంట్స్.. రజినీ స్టైల్ ఆ రేంజ్ లో ఉంటాయ్. ఇప్పుడు సేమ్ అదే స్థాయిలో అంతకు మించిన మాట చెప్పాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.
బాహుబలి సిరీస్ లో రెండోది చివరది అయిన బాహుబలి ది కంక్లూజన్ కు.. ఫస్ట్ లుక్ ను ముంబై ఫిలిం ఫెస్టివల్ లాంఛ్ చేసింది యూనిట్. మహేంద్ర బాహుబలి లుక్ ని అదిరిపోయే రేంజ్ లో చూపించారు. పోస్టర్ లాంఛ్ చేయగానే.. ఆడిటోరియం అంతా అరుపులు కేకలతో నిండిపోయింది. అయితే.. బాహుబలి కోసం ఎన్నో సినిమాలను వదిలేసుకోవాల్సి వచ్చిందనే సంగతి తెలిసిందే. ఇలా చేసినందుకు బాధగా లేదా అంటూ.. ప్రభాస్ కు క్వశ్చన్ ఎదురైంది.
'ఒక బాహుబలి.. నేను చేసే వంద సినిమాలకు సమానం' అంటూ ప్రభాస్ చెప్పడం.. అక్కడి వారినందరినీ ఆకట్టుకుంది. ఒక్క సినిమా కోసం నాలుగైదేళ్ల కెరీర్ ని తాకట్టు పెట్టగల స్టార్ హీరో.. బహుశా ఇండియాలో వేరే ఎవరూ ఉండరు. బాహుబలి విషయంలో రాజమౌళి కంటే ఎక్కువ మార్కులు.. అభినందనలు ప్రభాస్ కే దక్కాలి కదూ
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/