Begin typing your search above and press return to search.

'సలార్' పై డార్లింగ్ ప్రభాస్ సంచలన నిర్ణయం..!!

By:  Tupaki Desk   |   24 Dec 2020 4:00 PM IST
సలార్ పై డార్లింగ్ ప్రభాస్ సంచలన నిర్ణయం..!!
X
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఈ ఏడాది మహమ్మారి కారణంగా షూటింగ్స్ ఆపేసి ఇంట్లో ఉన్నా తన అభిమానులకు ట్రీట్ ఇవ్వడం మర్చిపోలేదు. రాధేశ్యామ్ షూటింగ్ దశలో ఉండగానే వరుస సినిమాలను ప్రకటించేసాడు. ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా చివరి దశలో ఉండగా.. మరో తీపి కబురు ఫ్యాన్స్ కోసం రెడీ చేసాడు. అదేంటంటే.. డార్లింగ్, కేజీఎఫ్ డైరెక్టర్ కాంబినేషన్ కలిసి 'సలార్' మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే మాఫియా నేపథ్యంలో ఇంతవరకు ఏ సినిమాలో చూపించని వయోలెన్స్, యాక్షన్ ప్లాన్ చేశారట. ఇక న్యూ అప్డేట్ ఏంటంటే.. సలార్ సినిమా షూటింగ్ ఈ సంక్రాంతి తర్వాత అంటే జనవరి మూడో వారం నుండి ప్రారంభించనున్నారట. అంతేగాక ప్రశాంత్ - ప్రభాస్ ఈ సలార్ మూవీని కేవలం నాలుగు నెలలలో పూర్తి చేయాలని అనుకుంటున్నారట.

అదే గనక నిజమైతే టాలీవుడ్ హీరోలలో ఇంత ఫాస్ట్ గా షూటింగ్ పూర్తిచేసిన హీరోగా ప్రభాస్ రికార్డు బ్రేక్ చేసే అవకాశం ఉంది. ఇక సలార్ మూవీని దసరా పండుగ వరకు విడుదలకు సిద్ధం చేయాలనీ మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉందట. అందులో ఓ కథానాయికగా బాలీవుడ్ భామ దిశా పటాని పేరు పరిశీలనలో ఉందట. కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ ఎవరితో సినిమా చేస్తాడో.. అనుకుంటుండగా చాలామంది బడా హీరోల పేర్లు వినిపించినా.. అనూహ్యంగా ప్రభాస్ పేరు తెరమీదకి రావడం అందరిని ఆశ్చర్యానికి గురించేసింది. మరి హీరోయిజం ఎలివేషన్స్ ఓ రేంజిలో చూపించే ప్రశాంత్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను ఎలా చూపిస్తాడో చూడాలి. ఇప్పటికే విడుదల చేసిన సలార్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. ఇక ఈ సలార్ మూవీని కూడా కేజీఎఫ్ ప్రొడ్యూసర్ విజయ్ కిరగందుర్ నిర్మించానున్నారు.