Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ 'స‌లార్‌' రిలీజ్ ఎప్పుడో తెలుసా?

By:  Tupaki Desk   |   25 March 2022 6:23 AM GMT
ప్ర‌భాస్ స‌లార్‌ రిలీజ్ ఎప్పుడో తెలుసా?
X
క‌రోనా కారణంగా గ‌త కొన్ని నెల‌లుగా రిలీజ్ వాయిదా ప‌డుతూ వ‌స్తున్న భారీ చిత్రాలు ప‌రిస్థితుల్లో మార్పులు మొద‌ల‌వుడంతో ఒక్కొక్క‌టిగా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేస్తూ బాక్సాఫీస్ పై దండ‌యాత్ర చేస్తున్నాయి. ఇటీవ‌ల `రాధేశ్యామ్‌` చిత్రంతో ప్ర‌భాస్ థియేట‌ర్ల‌లో సంద‌డి చేసిన విష‌యం తెలిసిందే. డివైట్ టాక్ ని సొంతం చేసుకున్న మూవీ దాదాపుగా 200 కోట్లు రాబ‌ట్టి భారీ ఓపెనింగ్స్ ద‌క్కించుకున్న చిత్రంగా రికార్డు సాధించింది. దాదాపు మూడేళ్లుగా ఎదురుచూస్తున్న ఈమూవీ రిలీజ్ కావ‌డంతో ప్ర‌భాస్ త‌న త‌దుప‌రి చిత్రాల‌పై దృష్టి పెట్టారు.

మైథ‌లాజిక‌ల్ మూవీ `ఆది పురుష్‌` షూటింగ్ రాకెట్ వేగంతో పూర్తి చేసిన ప్ర‌భాస్ ఇప్పుడు రెండు క్రేజీ ప్రాజెక్ట్ ల‌లో న‌టిస్తూ బిజీగా వున్నారు. అంతులో ఒక‌టి `కేజీఎఫ్` ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న `స‌లార్‌` చిత్రం ఒక‌టి. హై వోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. కోల్ మాఫియా నేప‌థ్యంలో ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిపిన షెడ్యూల్ తో చిత్రీక‌ర‌ణ 30 శాతం పూర్త‌యింద‌ని చిత్ర బృందం తెలిపింది.

శృతిహాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్ పై `కేజీఎఫ్‌` వంటి సంచ‌ల‌న చిత్రాన్ని నిర్మించిన యంగ్ ప్రొడ్యూస‌ర్ విజ‌య్ కిర‌గందూర్ అత్యంత భారీ బ‌డ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ మూవీలో ఆయ‌న పాత్ర‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ఇటీవ‌లే విడుద‌లై సినిమాపై ఆస‌క్తిని రేకెత్తించింది.

ప్ర‌భాస్ ఫ‌స్ట్ లుక్ కూడా సినిమా ఏ రేంజ్ లో వుండ‌బోతోందో స్ప‌ష్టం చేసింది. ర‌గ్గ్డ్ లుక్ లో గ్యాంగ్ స్ట‌ర్ గా ప్ర‌భాస్ ని చూపించిన తీరు సినిమాపై మైప్ ని క్రియేట్ చేసింది. ఇదిలా వుంటే ఈ మూవీ గురించి నిర్మాత విజ‌య్ కిర‌గందూర్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. `స‌లార్‌` చిత్రీక‌ర‌ణ ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన షూటింగ్ తో 30 శాతం పూర్త‌యింద‌ని, తాజా షెడ్యూల్ మే నుంచి ప్రారంభం కానుంద‌ని స్ప‌ష్టం చేశారు.

ఈ ఏడాదిలోపే చిత్రీక‌ర‌ణ మొత్తం పూర్తి చేసి సినిమాని మాత్రం వ‌చ్చే ఏడాది ఏప్రిల్ లేదా జూన్ లో కానీ విడుద‌ల చేస్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. గ‌త కొన్ని రోజులుగా ఈ మూవీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల‌కు రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చి నిర్మాత గుడ్ న్యూస్ చెప్పారు. దీంతో ఈ మూవీ ఖ‌చ్చితంగా బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నాలు సృష్టించ‌డం ఖామ‌ని ప్ర‌భాస్ అభిమానులు ధీమాగా వున్నార‌ట‌.