Begin typing your search above and press return to search.
మరోసారి ప్రభాస్ వెనక్కి తగ్గుతున్నారా?
By: Tupaki Desk | 16 Feb 2022 10:00 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి వెనక్కి తగ్గుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వివరాల్లోకి వెళితే... టాలీవుడ్ హీరోల్లో అత్యధికంగా భారీ చిత్రాలని చేస్తున్న హీరో ప్రభాస్.
మూడేళ్ల శ్రమ తరువాత `రాధేశ్యామ్` విడుదలకు సిద్ధమవుతుండగా మరో నాలుగు చిత్రాలని లైన్ లో పెట్టారు. ఇందులో బాలీవుడ్ లో తొలి సారి చేస్తున్న `ఆదిపురుష్` ఇప్పటికే చిత్రీకరణ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో వుంది.
`కేజీఎఫ్` ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో హోంబలే ఫిలింస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న `సలార్` చిత్రంలో నటిస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ తెలుగు, కన్నడ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కుతోంది.
ఈ మూవీ కూడా ఐదు భాషల్లో విడుదల కానుంది. ఇదే కాకుండా ఇటీవలే `ప్రాజెక్ట్ కె`ని మొదలు పెట్టారు. `మహానటి` ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ టైమ్ మెషీన్ తరహా కథతో తెరకెక్కుతోంది. వీటితో పాటు `అర్జున్ రెడ్డి` ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తో `స్పిరిట్` మూవీ చేస్తున్నారు.
హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ మూవీ ప్రస్తుతం సందీప్ వంగ చేస్తున్న `యానిమల్` తరువాత సెట్స్ పైకి రానుంది. మారుతి డైరెక్షన్ లోనూ ఓ సినిమా చేయబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఇంత వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు.
ఇప్పటికే ఇలా వరుసగా ఐదు డిఫరెంట్ జోనర్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్న ప్రభాస్ మరోసారి తన సినిమా రిలీజ్ విషయంలో వెనకడుగు వేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇటీవల బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ మూవీ కోసం తన `ఆది పురుష్` డేట్ ని త్యాగం చేసిన ప్రభాస్ ఈ సారి కేజీఎఫ్ స్టార్ రాఖీభాయ్ యష్ కోసం వెనక్కి తగ్గుతున్నారట.
అమీర్ ఖాన్ నటించిన `లాల్ సింగ్ చద్దా`ని ముందు ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్నామంటూ ప్రకటించారు. అయితే సినిమా ఆ సమయానికి రెడీ కావడం లేదని `ఆది పురుష్` రిలీజ్ డేట్ అయిన ఆగస్టు 11కు మార్చారు. దీంతో ప్రభాస్ `ఆది పురుష్` రిలీజ్ నెల రోజులు వెనక్కి వెళ్లింది.
తాజాగా ప్రభాస్ నటిస్తున్న మరో చిత్రం `సలార్` రిలీజ్ డేట్ విషయంలోనూ ప్రభాస్ వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది. ఈ మూవీని ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. అయితే ఇదే రోజున `కేజీఎఫ్ చాప్టర్ 2` ని రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు.
ఈ రెండు చిత్రాలకు నిర్మాత ఒకరే కావడంతో కేజీఎఫ్ కోసం `సలార్` రిలీజ్ డేట్ ని వెనక్కి నెట్టి నట్టుగా తెలుస్తోంది. అంతే కాకుండా త్వరలో ప్రభాస్ `రాధేశ్యామ్` ప్రమోషన్ లలో పాల్గొనబోతున్నారు.
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా `కేజీఎఫ్ 2` ప్రమోషన్ లని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో `సలార్` మేజర్ షెడ్యూల్ ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆ కారణంగా ఈ ఇద్దరూ `సలార్` షూటింగ్ కి కొన్ని రోజులు బ్రేక్ ఇవ్వబోతున్నారు. దీంతో `సలార్` రిలీజ్ ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని, అందుకే ఈ మూవీ రిలీజ్ డేట్ ని మేకర్స్ వాయిదా వేస్తున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.