Begin typing your search above and press return to search.

జపాన్ లో కూడా సాహో అనిపిస్తారట!

By:  Tupaki Desk   |   5 April 2019 6:30 AM GMT
జపాన్ లో కూడా సాహో అనిపిస్తారట!
X
ఈ నెలాఖరుకు.. ఎగ్జాక్ట్ గా చెప్తే ఏప్రిల్ 28 వ తేదీకి 'బాహుబలి: ది కంక్లూజన్' రిలీజై సరిగ్గా రెండేళ్ళు. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ సినిమా ఇంతవరకూ రిలీజ్ కాలేదు. 'బాహుబలి' తర్వాతా ప్రభాస్ టేకప్ చేసిన 'సాహో' బడ్జెట్.. స్కేల్ పెద్దది కావడంతో షూటింగ్ కోసం ఎక్కువ సమయం తీసుకుంది. 'బాహుబలి' తర్వాత ఆ రేంజ్ కి తగ్గకుండా ఉండే సినిమాను ప్రేక్షకులు ప్రభాస్ నుండి ఆశిస్తారనే ఉద్దేశంతో యూవీవారు కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో తెరకెక్కిస్తున్నారు. ఇక రిలీజ్ కూడా అదే స్థాయిలో ఉండబోతోందట.

'సాహో' తెలుగు.. హిందీతో పాటుగా కొన్ని ఇతర భారతీయ భాషలలో ఆగష్టు 15 వ తారీఖున ఒకేసారి రిలీజ్ కానుంది. టీ సీరీస్ వారు హిందీ వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ను భారీ ధరకు సొంతం చేసుకున్నారు. రిలీజ్ కూడా భారీ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే 'బాహుబలి' తర్వాత ప్రభాస్ కు జపాన్ లో భారీగా ఫాలోయింగ్ ఏర్పడింది. అందుకే జపాన్ లో ఉన్న ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ 'సాహో' రైట్స్ ను భారీ రేటుకు సొంతం చేసుకున్నారు. జపాన్ లో అధిక సంఖ్యలో థియేటర్లలలో 'సాహో' ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అయితే జపాన్లో ఆగష్టు 15 న కాకుండా మూడు వారాలు ఆలస్యంగా రిలీజ్ అవుతుందట.

అంతే కాకుండా 'సాహో' కోసం జపాన్ లో భారీ ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నారట. అందులో టోక్యోలో జరగనున్న ప్రమోషనల్ ఈవెంట్ కు ప్రభాస్ స్వయంగా హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమా కూడా జపాన్ లో హిట్ అయిందంటే డార్లింగ్ ను ప్యాన్ ఇండియా స్టార్ అని కాకుండా ఇంటర్నేషనల్ స్టార్ అని పిలవాల్సి ఉంటుందేమో!