Begin typing your search above and press return to search.

అబుదాబిలో రెబల్ స్టార్ ముగించేశాడు

By:  Tupaki Desk   |   30 May 2018 4:59 PM IST
అబుదాబిలో రెబల్ స్టార్ ముగించేశాడు
X
బాహుబలి ప్రభాస్ ఇప్పుడు తన కొత్త సినిమాను చకచకా పూర్తి చేసే పనిలో పడ్డాడు. బాహుబలి తర్వాత సాహోను ఫుల్ స్వింగ్ లో చేయాలని భావించినా.. అబుదాబిలో ప్లాన్ చేసిన షూటింగ్ బాగా ఆలస్యం అయింది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను ఏకంగా 40 రోజుల పాటు షూటింగ్ చేసేలా ప్లాన్ చేశారు.

మొదట అనుమతులు లభించకపోయినా.. ఆ తర్వాత సాధించిన సాహో టీం.. ఇప్పుడు దిగ్విజయంగా అబుదాబి షెడ్యూల్ ను పూర్తి చేశారు. షూటింగ్ సమయంలో గల్ఫ్ రీజనల్ మీడియా అందించిన సహకారానికి థ్యాంక్స్ చెబుతూ సాహో టీం ఫోటోలను పోస్ట్ చేసింది. షూటింగ్ సమయంలో రెగ్యులర్ గా తమ చిత్రానికి సంబంధించిన అప్ డేట్స్ ను పోస్ట్ చేసిన మీడియా జనాలకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. అబుదాబిలో షూటింగ్ పూర్తయిన సందర్భంగా మీడియా జోన్ అథారిటీ సీఈఓ మార్యం అల్ మహీరీతో కలిసి దర్శకుడు సుజిత్.. యూవీ క్రియేషన్స్ నిర్మాతలు ఫోటోలకు పోజులు ఇచ్చారు.

సాహో టీం పడిన కష్టాన్ని దగ్గరగా గమనించామని చెబుతున్న ఎంజెడ్ఏ సీఈఓ.. ఈ సన్నివేశాలను ఆన్ స్క్రీన్ పై చూసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు చెబుతున్నారు. అబుదాబిలో ఇంత సుదీర్ఘంగా షూటింగ్ జరుపుకున్న మూడో అంతర్జాతీయ చిత్రం సాహో అని చెప్పడం విశేషం. ఇండియన్ ఆడియన్స్ ను అబుదాబి అందాలను చూపించే ఈ సినిమా తమకు ప్రత్యేకంగా చెబుతున్నారు.