Begin typing your search above and press return to search.

ఆరు నెలల్లో సాహో రెడీ అవుతుంది

By:  Tupaki Desk   |   10 Aug 2017 6:43 PM IST
ఆరు నెలల్లో సాహో రెడీ అవుతుంది
X
అసలు సాహో సినిమా షూటింగ్ జరుగుతోందా? ప్రభాస్ ఈ సినిమాను ఎప్పుడు పూర్తి చేస్తాడు? మొన్న బయటకొచ్చిన ఫోటోలన్నీ ప్రభాస్ సాహోలో వేసిన గెటప్పులేనా? అప్పుడెప్పుడో ఒక చిన్న టీజర్ ఇచ్చారో.. మరి ట్రైలర్ ఎప్పుడు? ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? ప్రభాస్ హిందీలో సొంతంగా డబ్బింగ్ చెబుతున్నాడా? ... వామ్మో.. సాహో సినిమా గురించి మూవీ లవ్వర్స్ కురిపిస్తున్న ప్నశ్నల వర్షం మామూలుగా లేదులే.

ఇటువంటి ప్రశ్నలకు నిజంగానే అటు సాహో టీమ్ నుండి కాని ఇటు సాహో సినిమా యాక్టర్ల నుండి కాని ఎటువంటి సమాధానాలు రావట్లేదు. ఇంతవరకు ఈ సినిమా ఎప్పుడొస్తుంది ప్రస్తుతం షూటింగ్ ప్రోగ్రెస్ ఎలా ఉంది అనే విషయంలో ఒక్కటి కూడా అధికారకమైన ప్రకటనే లేదు. కాని ఎట్టకేలకు ఒక్క చిన్న ప్రకటన మాత్రం వచ్చింది. ఈ సినిమాకు కెమెరామాన్ గా పనిచేస్తున్న మది రాజు గంగాధరన్ ఎలియాస్ మది (మిర్చి మూవీ ఫేం) ఉన్నాడు చూడండి.. ఆయన మాత్రం స్పందించాడు. 'సాహో సినిమా షూటింగ్ మొదలైందని.. ఈ షూటింగ్ మొత్తం రానున్న ఆర్నెలల్లో కంప్లీట్ అయిపోతుందని చెప్పాడు. ఆ అప్డేట్ తో ఇప్పుడు ప్రభాస్ అభిమానులు ఇతర మూవీ లవ్వర్స్ పండగ చేసుకుంటున్నారంతే.

ఇకపోతే సాహో సినిమాలో హీరోయిన్ మాత్రం ఇంతవరకు అధికారికంగా ఫైనల్ కాలేదు. అనుష్క నుండి సోనాక్షి సిన్హా వరకు.. శ్రద్దా కపూర్ నుండి రష్మిక మందాన్న వరకు చాలా పేర్లే వినిపిస్తున్నాయి. సర్లేండి.. ఈ సినిమాటోగ్రాఫర్ త్వరలోనే ఆ విషయం కూడా చెబుతాడేమో చూద్దాం.