Begin typing your search above and press return to search.

మాళ‌విక‌తో డార్లింగ్ రొమాన్స్ మొద‌లైందా?

By:  Tupaki Desk   |   5 Jan 2023 5:32 AM GMT
మాళ‌విక‌తో డార్లింగ్ రొమాన్స్ మొద‌లైందా?
X
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో 'రాజా డీల‌క్స్' అన‌ధికారిక టైటిల్ తో ఓ సినిమా తెర‌కెక్కు తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కొద్ది భాగం షూటింగ్ కూడా పూర్తి చేసారు. ఆ షూట్ లో ప్ర‌భాస్ స‌హా కీల‌క న‌టులంతా పాల్గొన్నారు. ఇటీవ‌ల వ‌రుస‌గా కొన్ని రోజుల పాటు డార్లింగ్ ఏకంగా మారుతి సినిమా షూట్ లోనే నిర‌వ‌ధికంగా పాల్గొంటున్నారు.

ప్ర‌భాస్ ఇచ్చిన డేట్ల‌లో షూట్ మొత్తం పూర్తి చేయాల‌ని ఆదేశాలివ్వ‌డంతో మారుతి వాటిని చ‌క‌చ‌కా పూర్తి చేసే ప‌నిలో ప‌డ్డారు. డార్లింగ్ స‌హా క‌థ డిమాండ్ చేయ‌డంతో సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు కూడా న‌టిస్తున్న‌సంగ‌తి తెలిసిందే. తాజాగా మారుతి కొత్త షెడ్యూల్ కి రెడీ అవుతున్నారు. ఈ షెడ్యూల్ లో ప్ర‌భాస్..మాళవికా మోహ‌న‌న్ మ‌ధ్య కొన్ని కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తార‌ని స‌మాచారం.

సినిమాలో ఈ సన్నివేశాలు ప్ర‌త్యేక ఆకర్ష‌ణ‌గా నిలుస్తాయ‌ని యూనిట్ ధీమా వ్య‌క్తం చేస్తుంది. మారుతి శైలి కామెడీ..ప్ర‌భాస్ త‌ర‌హా ఫ‌న్ తో కూడిన స‌న్నివేశాల‌ని స‌మాచారం.

ఆ ఫ‌న్ లోనే మాళ‌విక‌తో రొమాంటిక్ సన్నివేశాల‌కు తావిచ్చిన‌ట్లు తెలుస్తుంది. మాళ‌విక‌కి తెలుగు డెబ్యూ ఈ సినిమా. దీంతో షూట్ లో పాల్గొనాల‌ని ఎంతో ఉత్సాహంతో ఉంది.

తొలి సినిమాలోనే ఏకంగా ప్ర‌భాస్ తోనే న‌టించే అవ‌కాశం రావ‌డంతో అమ్మ‌డి ఆనందానికి అవ‌ధుల్లేవ్. సినిమాలో ఈ బ్యూటీ లీడ్ ఎలాంటిద‌న్న‌ది తెలియాలి. ఇదే సినిమాలో మ‌రో ఇద్ద‌రు హీరోయిన్లు కూడా న‌టిస్తున్నారు. ఈనేప‌థ్యంలో ముగ్గురిలో ఎవ‌రిది మెయిన్ లీడ్ అన్న‌ది క్లారిటీ లేదు.ప్ర‌భాస్ కి మ‌రో జోడీగి నిధి అగ‌ర్వాల్ ఏమాత్రం సెట్ అవ్వ‌డం లేదని ఇటీవ‌లే తెర‌పైకి వ‌చ్చింది.

రెండు వారాల షూటింగ్ పుటేజీ చెక్ చేసుకున్న మారుతి నిధి సెట్ అవ్వ‌డం లేద‌ని.. ఆకాంబో లో స‌న్నివేశాల‌పై అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. దీంతో నిధి అగ‌ర్వాల్ ని సినిమా నుంచి తొల‌గించి ఆమె స్థానంలో మెహ్రీన్ పిర్జాదాని తీసుకోవాల‌ని భావిస్తున్నట్లు ప్ర‌చారం సాగింది. మ‌రో నాయిక‌గా రిద్ది కుమార్ న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే..


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.