Begin typing your search above and press return to search.
కోమా, క్యాన్సర్ అంటూ భయపెట్టారు
By: Tupaki Desk | 5 July 2015 1:45 PM ISTప్రభాస్‌కి పెద్ద ప్రమాదం జరిగింది. తలకి తీవ్రంగా గాయమైంది. కోమాలోకి వెళ్లిపోయాడంటూ అప్పట్లో సీరియస్‌గా ప్రచారమైంది. బాహుబలి చిత్రీకరణలో ఈ గాయం అయ్యిందని రూమర్లు పుట్టుకొచ్చాయి. అయితే వీటివల్ల తీవ్రంగా ఇబ్బంది పడాల్సొచ్చిందని అన్నాడు ప్రభాస్. అంతేనా అసలు ఆ సన్నివేశంలో ఏం జరిగిందో పూస గుచ్చినట్టు చెప్పుకొచ్చాడిలా...
''కేరళలో నదీతరం దగ్గర శివలింగం భుజాన ఎత్తుకొని నడిచొచ్చే సన్నివేశాల్ని తెరకెక్కించాం. అక్కడ నీళ్లలో నాచు ఎక్కువగా ఉంది. నడుస్తున్నప్పుడు ప్రమాద వశాత్తూ జారిపడ్డా . చేతికి చిన్న గాయమైంది. అంతే ఆ రోజునుంచి ప్రచారం మొదలైంది. మొదట ప్రభాస్ కిందపడ్డాడట అన్నారు. ఆ తర్వాత తలకి దెబ్బ తగిలిందట అని మాట్లాడుకున్నారు. మరుసటి రోజు ఏకంగా కోమాలోకి వెళ్లిపోయాడట అని చెప్పుకొన్నారు. ఈ విషయం తెలిసి పెదనాన్నకి ఫోన్లు చేయడం మొదలు పెట్టారు. రోజుకు ఆరేడువందలు కాల్స్ వచ్చేవి. పెదనాన్న ఫోన్ చేసి ఎక్కడున్నావ్? ఏం కాలేదుగా? అని ప్రశ్నించేవారు. నాకేం కాలేదు. బాగానే ఉన్నా అని చెప్పేవాడిని'' అని తెలిపాడు ప్రభాస్.
ఆ రూమర్లు అక్కడితో ఆగిపోయాయా?? ''ఆ తర్వాత కొంతకాలానికి క్యాన్సర్ వచ్చింది అన్న ప్రచారం సాగింది. ఎప్పుడూ లేనివిధంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు పుకార్లు ప్రచారం సాగాయి. మేం సినిమా కోసం పడ్డ కష్టం ఒకెత్తు అయితే ఈ ప్రచారం మరొక ఎత్తు. ఆరేడు నెలలు ఈ ప్రచారం తీవ్రంగా ఇబ్బంది పెట్టింది'' అంటూ ముగించాడు.