Begin typing your search above and press return to search.

మూడు సినిమాల‌కు ప్ర‌భాస్ ప్యాకేజీ షాకిస్తోందిగా!

By:  Tupaki Desk   |   20 Aug 2020 3:30 AM GMT
మూడు సినిమాల‌కు ప్ర‌భాస్ ప్యాకేజీ షాకిస్తోందిగా!
X
పాన్ ఇండియా నుంచి పాన్ వ‌ర‌ల్డ్ స్థాయికి ఎదిగేందుకు డార్లింగ్ ప్ర‌భాస్ స‌రికొత్త ఎత్తుగ‌డ‌ల్ని ఎంచుకున్న సంగ‌తి తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో అంత‌కంత‌కు హీట్ పెంచేస్తున్నాడు. ప్ర‌స్తుతం జిల్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రాధే శ్యామ్ చిత్రంలో న‌టిస్తున్నాడు. ఇది పాన్ ఇండియా మూవీగా ప్ర‌మోట‌వుతోంది. పీరియాడిక‌ల్ ల‌వ్ స్టోరీతో బాక్సాఫీస్ వ‌ద్ద‌ ఎలాంటి మ్యాజిక్ చేయ‌బోతున్నాడు? అన్న‌ది చూడాలి. ఆ త‌ర్వాత నాగ్ అశ్విన్ - అశ్వ‌నిద‌త్ బృందంతో సైన్స్ ఫిక్ష‌న్ నేప‌థ్యంలో పూర్తిగా విభిన్న‌మైన క‌థాంశాన్ని ట్రై చేస్తున్నాడు. ఈ సినిమాతో ప్ర‌భాస్ ని పాన్ వ‌ర‌ల్డ్ హీరోగా ఎదిగేస్తాడ‌ని అశ్వ‌నిద‌త్ బృందం న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేసింది.

ఆ త‌ర్వాత కూడా మ‌రో పాన్ వ‌ర‌ల్డ్ సినిమానే చేస్తున్నాడు. తానాజీ ఫేం ఓంరౌత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఎ-ఆదిపురుష్ తెలుగు-హిందీ స‌హా దేశంలోని అన్నిభాష‌ల్లో రిలీజ్ కానుంది. అలాగే ప‌లు విదేశీ భాష‌ల్లోనూ రిలీజ్ చేయ‌నున్నామ‌ని ప్ర‌క‌టించారు. వ‌రుస‌గా ఈ మూడు సినిమాల‌తో ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ గా అవ‌త‌రించి పాన్ వ‌ర‌ల్డ్ హీరోగా ప్ర‌భాస్ ఎదిగేస్తాడా? లేదా? అన్న‌ది అటుంచితే ... ఒక్కో సినిమాకి అత‌డు అందుకుంటున్న పారితోషికం మాత్రం షాకిస్తోంది.

రాథే శ్యామ్ త‌ర్వాత‌ ప్రభాస్ - దీపిక- నాగ్ అశ్విన్ సినిమా.. ఆ త‌ర్వాత `ఆది పురుష్` ఈ మూడు సినిమాలకి ప్రభాస్ కి క్యాష్ రూపంలో వచ్చే డైరెక్ట్ రెమ్యునిరేషన్ దాదాపుగా 240 కోట్లు..! ఒక్కో సినిమాకి ప్రభాస్ కి దాదాపుగా 80 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడు..! అంటే మూడు సినిమాల‌కు క‌లిపి 240కోట్లు అందుకోబోతున్నాడ‌న్న‌మాట‌. ఇదే కాకుండా ఒక్కో సినిమాకి ఏదో ఒక‌ ఏరియా కి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ ... శాటిలైట్ రైట్స్ అదనంగా ప్రభాస్ కి ముడుతున్నాయి. అంటే తమిళ్ రిలీజ్ రైట్స్.... కన్నడ రిలీజ్ రైట్స్ లేదా ఇంకేదైనా రిలీజ్ రైట్స్ అత‌డి సొంతం అన్నమాట. వీట‌న్నిటి రూపంలో అత‌డికి భారీ మొత్తాలు అందుతాయి. ఇవ‌న్నీ అద‌న‌పు బోన‌స్ అనే చెప్పాలి.