Begin typing your search above and press return to search.

ప్రభాస్ నుంచి ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్

By:  Tupaki Desk   |   23 Jan 2023 8:00 AM IST
ప్రభాస్ నుంచి ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల లైన్ అప్ చాలా పెద్దగానే ఉందని చెప్పాలి. చేతిలో అర డజనుకి పైగా సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న సినిమాలు కావడం విశేషం. వీటిపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్టుల బడ్జెట్ సుమారుగా 2500 కోట్ల వరకు ఉంటాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే ప్రతి ఏడాది ప్రభాస్ తన నుంచి రెండు సినిమాలు ప్రేక్షకులు ముందుకు వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సుమారు 400 కోట్ల బడ్జెట్ తో సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మైథిలాజికల్ బ్యాక్ డ్రాప్ లో రామాయణం కథ ఆధారంగా ఈ సినిమాని దర్శకుడు ఆవిష్కరించారు.

త్రీడీలో ఈ మూవీ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది. దీంతోపాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీ ప్రభాస్ చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి పార్ట్ 1 ఈ ఏడాదిలోని ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమాలు అఫీషియల్ డేట్స్ ని కూడా కన్ఫర్మ్ చేసుకున్నాయి. సలార్ మూవీ కూడా సుమారు 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది.

వచ్చే ఏడాది ఆరంభంలో మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా డీలక్స్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కె థియేటర్స్ లోకి వచ్చే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తుంది. అలాగే 2024 కూడా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేయబోయే సినిమాతో పాటు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో చేయబోయే సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలా మూడేళ్లపాటు ఏడాది రెండు సినిమాలు ద్వారా ప్రభాస్ ప్రేక్షకుల ముందుకి రాబోతున్నట్లు తెలుస్తుంది.