Begin typing your search above and press return to search.

ప్రభాస్ ఫస్ట్.. 'లాస్ట్'లో వేరే హీరోతో సూపర్ హిట్..!

By:  Tupaki Desk   |   23 April 2020 11:00 PM IST
ప్రభాస్ ఫస్ట్.. లాస్ట్లో వేరే హీరోతో సూపర్ హిట్..!
X
డార్లింగ్ ప్రభాస్ సినిమా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 17ఏళ్ళు దాటింది. హీరో రేంజ్ నుండి ఈరోజు ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. 'బాహుబలి' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ 17 ఏళ్ల కెరీర్ లో ప్రభాస్ చేసిన సినిమాలు 19 మాత్రమే.. అలానే ఆయన రిజెక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. ప్రభాస్ నో చెప్పిన కథలతో ఇతర హీరోలు హిట్లు అందుకున్నారు. ఆ సినిమాలేవంటే..

ఒక్కడు-మహేష్ బాబు కెరీర్లోనే టర్నింగ్ పాయింట్. అయితే ఈ సినిమా ఫస్ట్ ప్రభాస్ నే చేరిందట. నిర్మాత ఎంఎస్ రాజు-గుణశేఖర్ కలిసి ప్రభాస్ - కృష్ణరాజులకు కథ వినిపించారట. గేమ్ స్క్రిప్ట్ రిస్క్ అనిపించడంతో నో చెప్పారట.
దిల్-వినాయక్ ఈ కథని ప్రభాస్ కే ఫస్ట్ వినిపించాడట. కానీ అప్పటికి ప్రభాస్ వేరే సినిమాతో బిజీగా ఉండడంతో మిస్ అయిందట. సింహాద్రి-రాజమౌళి ఈ కథను ఫస్ట్ ప్రభాస్ తో చేయాలనుకొని అతడిని సంప్రదిస్తే.. ఇంత మాస్ సబ్జెక్ట్ ని హ్యాండిల్ చేయలేడేమోననే సందేహంతో నో అన్నాడట.

ఆర్య-అల్లు అర్జున్ కెరీర్ పెద్ద మలుపు. ఈ స్క్రిప్ట్ ఫస్ట్ ప్రభాస్ వద్దకు వెళ్లిందట. కానీ అతడు రిజెక్ట్ చేయడంతో ఆ తరువాత సుకుమార్ అల్లరి నరేష్ కి వినిపించాడట. అప్పటికి నరేష్ బిజీగా ఉండడంతో అల్లు అర్జున్ తో సినిమా తీసి హిట్ అందుకున్నారు. బృందావనం- ప్రభాస్ తో 'మున్నా' లాంటి ఫ్లాప్ ఇచ్చిన వంశీ పైడిపల్లి.ప్రభాస్ ని దృష్టిలో పెట్టుకొని 'బృందావనం' కథ సిద్ధం చేసుకున్నాడు. కానీ అప్పటికి ప్రభాస్ బిజీగా ఉండడంతో ఈ సినిమా చేయలేకపోయాడట. నాయక్-ప్రభాస్ కోసం ఈ కథ సిద్ధం చేసుకున్నాడట వినాయక్. కానీ ప్రభాస్ అప్పటికి 'రెబెల్' సినిమా చేస్తుండడంతో ఈ ప్రాజెక్ట్ కి నో చెప్పాడని సమాచారం.

కిక్-రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్. ఈ సినిమా స్క్రిప్ట్ ముందుగా ప్రభాస్ వద్దకు వెళ్లిందట. కారణం తెలీదు కానీ సినిమా రవితేజను చేరింది. ఊసరవెల్లి-ఎన్టీఆర్ కంటే ముందు ఈ కథ ప్రభాస్ కి వినిపించారట. కానీ ఎందుకో ప్రభాస్ రిజెక్ట్ చేశాడు. డాన్ శీను-దర్శకుడు గోపీచంద్ మలినేని ప్రభాస్ కోసం ఈ కథ సిద్ధం చేసుకున్నారట. 'బుజ్జిగాడు' సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ కి సేమ్ అన్పించడంతో నో అన్నాడట. కానీ రవితేజ తీసి హిట్ అందుకున్నాడు. జిల్-ప్రభాస్ 'బాహుబలి' సినిమాతో బిజీగా ఉన్న సమయంలో దర్శకుడు రాధాకృష్ణ ఈ కథ చెప్పేసరికి వెయిట్ చేయించడం ఇష్టం లేక నో అనేసాడట ప్రభాస్. ఇలా ప్రభాస్ కాదు అనుకున్న సినిమాలు ఇతర హీరోల కెరీర్లో హిట్లుగా నిలిచాయి.