Begin typing your search above and press return to search.

బాహుబలి ఊహలు నుంచి బయటకొచ్చా

By:  Tupaki Desk   |   9 Sept 2017 5:08 PM IST
బాహుబలి ఊహలు నుంచి బయటకొచ్చా
X
బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఇప్పుడు దేశమంతటా తెగ పాపులర్ అయ్యాడు. బాహుబలి సాధించిన రికార్డులు తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు నేషనల్ స్థాయిలో రికార్డులను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రభాస్ ఆ అంచనాలను అందుకోవాలంటే ఏ స్థాయిలో కష్టపడాలన్నది ఎవరు ఉహించలేకపోతున్నారు.

ఇక ప్రభాస్ మాత్రం బాహుబలి గురించి ఏం ఆలోచించడం లేదని చెబుతున్నాడు. ప్రస్తుతం తన టార్గెట్ మొత్తం సాహో సినిమాపైనే ఉందని బాహుబలి ఉహల నుంచి ఎప్పుడో బయటకు వచ్చానని అంటున్నాడు. అదే విధంగా బాహుబలి ఇచ్చిన విజయం చాలా గొప్పది.. దేశంలో ఎక్కడికి వెళ్లినా అందరూ గుర్తుపడుతున్నారు అని నెక్స్ట్ సినిమా కోసం కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు.

ఇక వారి అంచనాలు అందుకునే విధంగా సాహో కోసం కష్టపడతాను అంటున్నాడు ఈ బాహుబలి. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చాలా మంది బాలీవుడ్ తారలు నటిస్తున్నారు. ఇప్పటికే హీరోయిన్ శ్రద్దా కపూర్ షూటింగ్ లో ప్రభాస్ తో జాయిన్ అయ్యిదందని తెలుస్తోంది. దాదాపు 100 కోట్లతో యువి క్రియేషన్స్ ఈ సినిమాను తెలుగు -హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తోంది.