Begin typing your search above and press return to search.

నెట్టింట రెబల్ స్టార్ ఫాలోయింగ్ నయా రికార్డు!!

By:  Tupaki Desk   |   6 Aug 2020 1:00 PM GMT
నెట్టింట రెబల్ స్టార్ ఫాలోయింగ్ నయా రికార్డు!!
X
టాలీవుడ్ స్టార్ హీరో డార్లింగ్ ప్రభాస్.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు. దేశవ్యాప్తంగా ప్రభాస్ సినిమాకోసం అభిమానులు కళ్ళు కాయలుకాచేలా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ అవ్వడంతో ప్రభాస్ తో చేసే సినిమాలు భారీ బడ్జెట్ లోనే ఉంటున్నాయి. సాహో తర్వాత ప్రభాస్, జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమా చేస్తున్నాడు. విదేశాలలో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా పీరియాడిక్ లవ్ స్టోరీగా రూపొందుతుంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో నటించబోతున్నాడని ఆల్రెడీ తెలిసిందే.

అయితే ఈ సంవత్సరం చివరలో సినిమా షూటింగ్ ప్రారంభం కానుందట. సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ హీరో పాత్రలో కనిపించనున్నాడట. సైన్స్ ఫిక్షన్ జానర్ కాబట్టి గ్రాఫిక్స్ వర్క్ భారీ లెవెల్లో ఉంటుంది. సి.అశ్వినీదత్ నిర్మాణంలో పాన్ ఇండియా సినిమాగా రూపొందుతుందనీ, ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. డార్లింగ్ ప్రభాస్ కి సోషల్ మీడియాలో విపరీతంగా క్రేజ్ ఉంది. ఆయన సోషల్ మీడియాలో సరిగ్గా ఉండరు. కానీ ఉంటే మాత్రం ఓ రేంజిలో ఫాలోయింగ్ ఏర్పడుతుంది.

సోషల్ మీడియాలో కూడా స్ట్రాంగెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న ప్రభాస్ ఇటీవలే ఫేస్బుక్ లో రికార్డు స్థాయి ఫాలోవర్లతో ఇండస్ట్రీలో టాప్ స్థానంలో నిలిచాడు. అయితే ప్రభాస్ ఫ్యాన్ బేస్ కేవలం ఫేస్బుక్ లో మాత్రమే కాదు.. ఇంస్టాగ్రామ్ లో కూడా రచ్చ చేస్తున్నారు. ఫస్ట్ ఎవర్, ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్స్ సొంతం చేసుకున్న పోస్ట్ నుంచి తాజాగా ఫాస్టెస్ట్ 5 మిలియన్ ఫాలోవర్లను పొందిన హీరోగా ప్రభాస్ రికార్డు నెలకొల్పాడు. గత ఏడాది ఏప్రిల్ నెలలో ఇంస్టాగ్రామ్ లో అకౌంట్ క్రియేట్ చేసిన ప్రభాస్ ఈ ఏడాదిన్నర కాలంలో 5 మిలియన్ల ఫాలోవర్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ దెబ్బతో డార్లింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ నెట్టింట కూడా రచ్చ చేస్తున్నారని నెటిజన్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.