Begin typing your search above and press return to search.

మరో మైలు రాయి చేరిన ప్రభాస్‌

By:  Tupaki Desk   |   15 March 2021 5:47 AM GMT
మరో మైలు రాయి చేరిన ప్రభాస్‌
X
యంగ్ రెబల్‌ స్టార్ ప్రభాస్ హీరోగా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. రాధే శ్యామ్ సినిమా తో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రభాస్ వచ్చే ఏడాది సలార్ మరియు ఆది పురుష్‌ల సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. ప్రభాస్ సినిమా సినిమా కు తన స్టార్ డం ను పెంచుకుంటూనే ఉన్నాడు. బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు మించిన క్రేజ్ ప్రస్తుతం ప్రభాస్ కు ఉంది అనడంలో సందేహం లేదు. ఆ విషయం ఆయన సోషల్‌ మీడియా ఫాలోవర్స్ ను చూస్తే అర్థం అవుతుంది.

ఏ సౌత్ ఇండియన్ స్టార్‌ హీరోకు లేనంత ఫాలోయింగ్‌ ను ఫేస్ బుక్‌ లో ప్రభాస్ దక్కించుకున్నాడు. ఇతర తెలుగు హీరోలకు అందనంత దూరంలో ప్రభాస్ ఫేస్‌ బుక్ ఫాలోవర్స్ సంఖ్య ఉంది. ఇటీవలే 20 మిలియన్ ల మార్క్ ను క్రాస్‌ చేసిన ప్రభాస్ తాజాగా మరో రికార్డ్‌ ను క్రాస్ చేశాడు. ప్రభాస్ ఫేస్ బుక్‌ ఫాలోవర్స్ సంఖ్య చాలా తక్కువ సమయంలో 22 మిలియన్ ల మార్క్‌ ను క్రాస్ చేసింది. ఇన్ స్టా గ్రామ్‌ లో కూడా ఖాతాను కలిగి ఉన్న ప్రభాస్‌ కు అక్కడ 6.3 మిలియన్ ల ఫాలోవర్స్ ఉన్నారు. మొత్తానికి ప్రభాస్‌ సోషల్‌ మీడియాలో దూకుడు కనబర్చుతున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న చేసిన రాధేశ్యామ్‌.. ఆది పురుష్‌.. సలార్‌ మరియు నాగ్ అశ్విన్‌ ల సినిమాలు విడుదల అయితే పాన్ ఇండియా రేంజ్ లో ప్రభాస్ రేంజ్ మరింత పెరగడం ఖాయం అంటున్నారు.