Begin typing your search above and press return to search.
రజనీకాంత్ తర్వాత మళ్లీ ప్రభాస్ కే ఆ రేంజ్?!
By: Tupaki Desk | 13 Dec 2020 10:17 AM ISTసౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించే ఏ సినిమా గురించి అయినా బాలీవుడ్ లో ఆసక్తికర చర్చ సాగుతుంది. రోబో.. 2.0 సహా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో ఉత్తరాదినా ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. రజనీ సినిమా వస్తోంది అంటే.. షారూక్ ఖాన్.. సల్మాన్ ఖాన్.. అమీర్ ఖాన్ .. అక్షయ్ కుమార్ లాంటి స్టార్లు వేచి చూస్తారు. ఆసక్తిగా ఆ సినిమా సంగతుల్ని బాక్సాఫీస్ రికార్డులను ఆరా తీస్తుంటారు. మళ్లీ సౌత్ నుంచి ఉత్తరాదిన ఆ స్థాయిని అందుకునే సత్తా ఎవరికి ఉంది? అంటే బాహుబలి స్టార్ ప్రభాస్ పేరు మాత్రమే వినిపిస్తుంది.
మార్కెట్ బాక్సాఫీస్ రికార్డుల పరంగా రజనీకాంత్ తర్వాత విస్త్రతమైన పరిధిని విస్తరించిన స్టార్ గా డార్లింగ్ ప్రభాస్ పేరు మార్మోగుతోంది. ఇక అదంతా సరే కానీ.. మన స్టార్లతో హిందీ స్టార్ హీరోలకు ఉన్న వ్యక్తిగత రిలేషన్ షిప్ పరిశీలిస్తే... రజనీకాంత్ .. చిరంజీవి ..నాగార్జున.. వెంకటేష్ .. అలానే మహేష్.. ప్రభాస్ లకు హిందీ చలనచిత్ర సీమలో చక్కని అనుబంధం ఉందన్నది తెలిసిన వ్యవహారమే. ఉత్తరాది చలనచిత్రపరిశ్రమ అగ్ర హీరోలు దర్శకనిర్మాతలతో మన హీరోలకు సత్సంబంధాలున్నాయి.
సూపర్ స్టార్ రజనీకాంత్ తన 70 వ పుట్టినరోజును పురష్కరించుకుని బాద్ షా షారూక్ ఖాన్ .. కిలాడీ అక్షయ్ కుమార్ సహా పలువురు అగ్ర బాలీవుడ్ తారలు శుభాకాంక్షలు తెలిపారు. సినీ పరిశ్రమకు చెందిన స్నేహితులు పుట్టినరోజున అతనికి ప్రత్యేకమైన అనుభూతిని కలిగించే సందేశాల్ని పంపారు.
షారూక్ అయితే రజనీపై ప్రేమను కురిపిస్తూ.. తన `చెన్నై ఎక్స్‌ప్రెస్` చిత్రం నుండి లుంగీ డాన్స్ పాట స్టిల్ ని అభిమానులకు షేర్ చేశాడు. పుట్టినరోజు శుభాకాంక్షలు రజనీకాంత్ !!! ఏకైక తలైవా.. అంటూ పొగిడేశారు షారూక్. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ తన ట్విట్టర్ హ్యాండిల్ లో రజనీకాంత్ ఆరోగ్యకరమైన సుదీర్ఘ జీవితాన్ని కలిగి ఉండాలని కోరుకున్నారు. అన్నట్టు అంతటి గొప్ప ప్రముఖులు రజనీకాంత్ కాకుండా సౌత్ స్టార్లలో ఎవరికి విషెస్ చెబుతారు? అన్నది కూడా ఆసక్తికర ఎలిమెంట్. డార్లింగ్ ప్రభాస్ కి అతడి సన్నిహితుల నుంచి ఉత్తరాది బాక్సాఫీస్ మార్కెట్ వర్గాల నుంచి విషెస్ దక్కినా అగ్ర తారల నుంచి విషెస్ అందుకునే స్థాయి ఎప్పటికి వస్తుంది? అన్నది వేచి చూడాలి. ప్రభాస్ ప్రస్తుతం యష్ రాజ్ ఫిలింస్ లో ధూమ్ 4లో నటిస్తారన్న ఊహాగానాలతో అతడి రేంజు ఆ స్థాయికి విస్తరిస్తుందేమో చూడాలి.