Begin typing your search above and press return to search.

మారుతితో ప్రభాస్ 'రాజా డీలక్స్'.. నిజమేనా..?

By:  Tupaki Desk   |   22 Jan 2022 5:42 AM GMT
మారుతితో ప్రభాస్ రాజా డీలక్స్.. నిజమేనా..?
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే అర డజనుకు పైగా పాన్ ఇండియా చిత్రాలను లైన్ లో లెట్టిన ప్రభాస్.. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.

అది కూడా వినోదాత్మక చిత్రాల స్పెసిలిస్ట్ మారుతి దర్శకత్వంలో అని తాజాగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

'ఆర్.ఆర్.ఆర్' నిర్మాత డీవీవీ దానయ్యతో ప్రభాస్ ఓ మూవీ చేయడానికి కమిట్ మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మారుతి డైరెక్షన్ లో డార్లింగ్ తో ఓ ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నారట. ఇందులో మరో ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి కూడా భాగం కానున్నారని టాక్ నడుస్తోంది.

'రాజా డీలక్స్' అనే టైటిల్ తో ప్రభాస్ కోసం మారుతి ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ కథని సిద్ధం చేస్తున్నారని అంటున్నారు. అలానే ఇదొక హారర్ కామెడీ కథాంశంతో రూపొందనుందనే మరో వార్త కూడా వినిపిస్తోంది.

అయితే దీనికి డార్లింగ్ నుంచి ఫైనల్ కాల్ రావాల్సి ఉందని చెప్పుకుంటున్నారు.

డైరెక్టర్ మారుతి గతంలో వెంకటేష్ - నాగచైతన్య వంటి హీరోలతో వర్క్ చేశారు. ఇప్పుడు గోపీచంద్ తో 'సీటీమార్' చేస్తున్నారు. త్వరలో మెగాస్టార్ చిరంజీవితో ఓ మూవీ చేసే అవకాశం ఉంది.

ఈ క్రమంలో ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా చేయబోతున్నారని టాక్ వచ్చింది. ఇదే నిజమైతే మారుతి బంపర్ ఆఫర్ కొట్టేసినట్లే.

డార్లింగ్ ప్రస్తుతం చేస్తున్న భారీ సినిమాల మధ్య గ్యాప్ లో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ఇకపోతే ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' సినిమా విడుదలకు రెడీ అయింది.

'సలార్' 'ఆదిపురుష్' సినిమాలు ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఇదే క్రమంలో 'ప్రాజెక్టు కె' 'స్పిరిట్' వంటి సినిమాలు ఉన్నాయి. మైత్రీ బ్యానర్ లో బాలీవుడ్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ తో డార్లింగ్ ఓ ప్రాజెక్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

మరి ఈ జాబితాలోకి మారుతి జాయిన్ అవుతారో లేదో చూడాలి.