Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ బ‌ర్త్ డే ట్రీట్.. దుమ్ము దుమార‌మే!

By:  Tupaki Desk   |   20 Oct 2021 4:30 AM GMT
ప్ర‌భాస్ బ‌ర్త్ డే  ట్రీట్.. దుమ్ము దుమార‌మే!
X
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ పుట్టిన రోజు వేడుక‌ల కోసం అభిమానులు ఏర్పాట్ల‌లో ఉన్నారు. అక్టోబ‌ర్ 23న గ్రాండ్ సెల‌బ్రేష‌న్స్ కోసం ఊరూ వాడా ఇప్ప‌టికే రెడీ అవుతున్నాయి. త‌న స‌హ‌చ‌రులు..ప‌రిశ్ర‌మ స్నేహితులు ఘ‌న‌మైన సెల‌బ్రేష‌న్ కోసం ఏర్పాట్ల‌లో ఉన్నారు. డార్లింగ్ బ‌ర్త్ డేకి ఇంకా రెండు రోజులే స‌మ‌యం ఉంది. దీంతో భారీ ఎత్తున ఏర్పాట్లు జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈసారి బ‌ర్త్ డే మ‌రింత ప్ర‌త్యేకం. మునుప‌టితో పోలిస్తే ప్ర‌భాస్ వ‌రుస‌గా మూడు పాన్ ఇండియా ప్రాజెక్ట్ ల్లో న‌టిస్తుండ‌గా.. మ‌రో రెండు మూడు ప్రాజెక్ట్ లు క్యూలో ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో అభిమానుల‌కు ట్రీట్ మాములుగా ఉండ‌ద‌ని అంచ‌నాలు అప్పుడే మొద‌లైపోయాయి. దాదాపు అన్ని సినిమాల నుంచి అప్ డేట్స్ ఉంటాయ‌ని అభిమానులంతా ఎంతో ఎగ్జైట్ గా ఎదురుచూస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ఆ ఎగ్జైట్ మెంట్ ని మ‌రింత రెట్టింపు చేస్తూ.. అంచ‌నాలు పీక్స్ కి చేర్చేలా డార్లింగ్ అండ్ టీమ్ డిసైడ్ అయిన‌ట్లే క‌నిపిస్తోంది. పుట్టిన రోజు సంద‌ర్భంగా సెట్స్ లో ఉన్న సినిమాల‌న్నింటి నుంచి అప్ డేట్స్ ఇవ్వ‌డానికి రెడీ అవుతున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. `స‌లార్` నుంచి గ్లిమ్స్..`రాధేశ్యామ్` నుంచి టీజ‌ర్.. `ఆదిపురుష్ 3డీ` నుంచి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్..`ప్రాజెక్ట్ కె` నుంచి విషెస్ పోస్ట‌ర్ తో అభిమానుల‌కు డార్లింగ్ ట్రీట్ ఇవ్వ‌బోతున్న‌ట్లు సమాచారం. నాలుగు భారీ బ‌డ్జెట్ చిత్రాలు కావ‌డం..అదీ పాన్ ఇండియా సినిమాలు కావ‌డంతో ప్ర‌భాస్ కి దేశ‌..విదేశాల్లో అభిమానులున్నారు. ఈ నేప‌థ్యంలో వ‌ర‌ల్డ్ మొత్తం డార్లింగ్ అప్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్న‌ట్లే క‌నిపిస్తోంది.

గ‌తంలో కొంత మంది విదేశీ అభిమానులైతే హైద‌రాబాద్ లో ప్ర‌భాస్ ఇంటి ముందు బోలెడంత హంగామా చేసిన సంగ‌తి తెలిసిందే. కేక్ లు క‌ట్ చేసి..ప్ర‌భాస్ ఫోటోల‌తో ఇంటి ముందుకెళ్లి డార్లింగ్ కి శుభాకాంక్ష‌లు తెలిపారు. బాహుబ‌లి రిలీజ్ అనంత‌రం చోటు చేసుకున్న బ‌ర్త్ డే వేడుక‌ల్లో ఇలాంటి స‌న్నివేశం క‌నిపించింది. ప్ర‌స్తుతం ఆయ‌న క్రేజ్ నాలిగింత‌లు రెట్టింపు అయింది. ఈ నేప‌థ్యంలో డార్లింగ్ బ‌ర్త్ డే మ‌రింత స్పెష‌ల్ గా ఉండే అవ‌కాశం క‌నిపిస్తోంది. `ఆదిపురుష్` చిత్రంతో డార్లింగ్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోన్న సంగ‌తి తెలిసిందే.