Begin typing your search above and press return to search.

'రాధే శ్యామ్' రిలీజ్ డేట్ ని లాక్ చేశారా..?

By:  Tupaki Desk   |   29 Dec 2020 6:12 PM GMT
రాధే శ్యామ్ రిలీజ్ డేట్ ని లాక్ చేశారా..?
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - పూజా హెగ్డే జంటగా నటిస్తున్న పీరియాడికల్ లవ్ డ్రామా ''రాధే శ్యామ్''. 'జిల్' ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్‌ మరియు యూవీ క్రియేషన్స్‌ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్నాయి. హిందీలో ఈ చిత్రాన్ని టీ-టిరీస్ భూషణ్ కుమార్ విడుదల చేయనున్నారు. ఈ మూవీ జ్యోతిష్యానికి సైన్స్‌ కు మధ్య సాగే బ్యూటిఫుల్ అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచేసాయి. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం 'రాధే శ్యామ్' సినిమా రిలీజ్ డేట్ ని లాక్ చేశారని తెలుస్తోంది.

ప్రభాస్ కెరీర్లో 20వ చిత్రంగా వస్తున్న 'రాధే శ్యామ్' ని 2021 ఏప్రిల్ 30న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే యూవీ టీమ్ మరియు టీ-సిరీస్ దీనిపై ఓ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. 'బాహుబలి' 'సాహో' చిత్రాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన ప్రభాస్ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఉత్తరాదిన ఈ చిత్రాన్ని భారీ లెవల్లో విడుదల చేయనున్నారట. ఇటలీలో కీలక సన్నివేశాలు పూర్తి చేసుకుని వచ్చిన చిత్ర బృందం.. ఇప్పుడు హైదరాబాద్ లో వేసిన భారీ సెట్స్ లో షూటింగ్ చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు - సత్యరాజ్ - భాగ్య‌శ్రీ - కునాల్ రాయ్ క‌పూర్‌ - స‌చిన్ ఖేడ్కర్‌ - ముర‌ళి శ‌ర్మ‌ - శాషా ఛ‌త్రి - ప్రియ‌ద‌ర్శి - రిద్దికుమార్‌ - స‌త్యాన్ వంటి భారీ క్యాస్టింగ్ కనిపించనుంది. ఇకపోతే 'రాధే శ్యామ్' తెలుగు తమిళ మలయాళ కన్నడ వెర్షన్స్ కి జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందిస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తుండగా కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ చేస్తున్నారు.