Begin typing your search above and press return to search.
బడ్జెట్ దాటిన పాన్ ఇండియా మూవీ.. టెన్షన్ లో స్టార్ హీరో!!
By: Tupaki Desk | 3 Jan 2021 11:07 PM ISTడార్లింగ్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న 'రాధేశ్యామ్' మూవీకోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుండి ఒక్కో పోస్టర్ విడుదల చేస్తుండటంతో అభిమానులలో అంచనాలు ఓ రేంజ్ కి చేరుకున్నాయి. సాహో లాంటి భారీ సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తుండటంతో ఈ సినిమా పై డార్లింగ్ ఫ్యాన్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా లాక్ డౌన్ ముందే యూరప్ షెడ్యూల్‌ను ముగించుకుని పీరియాడికల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతుంది. 1960ల కాలంనాటి ప్రేమకథ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందని అంటున్నారు మేకర్స్. అయితే ఈ సినిమాలో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ నటులు కూడా నటిస్తుండటంతో.. పాన్ ఇండియా మూవీగా ఐదు బాషలలో విడుదల కాబోతుంది.
ఇదిలా ఉండగా.. లాక్ డౌన్ విధించిన సమయం నుండి ఈ సినిమాను ఇండోర్ లోనే షూట్ చేస్తున్నారు. షూటింగ్ తుది దశకు చేరుకున్న ఈ సినిమా గురించి ప్రభాస్ బాగా టెన్షన్ కి గురవుతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమా బడ్జెట్ సుమారు 250కోట్లు దాటిందని అంటున్నారు. అంతేగాక ఇంకా సినిమా చివరి దశలోనే ఉంది. ఇదంతా పక్కన పెడితే రాధేశ్యామ్ మూవీ విడుదలైతే అన్ని కోట్ల కలెక్షన్ రాబడుతుందా.. లేదా అనే టెన్షన్ లో ప్రభాస్ ఉన్నాడట. బయట థియేటర్స్ ఓపెన్ అయినట్లే గాని సగం సీటింగ్ తో నడిపిస్తే బడ్జెట్ అయినా రాబడుతుందా అనే సందేహంతో డార్లింగ్ ఆలోచనలో పడ్డాడట. చూడటానికి భారీ కాస్ట్ ఉంది. పూజా హెగ్డే, భాగ్య శ్రీ లతో పాటు ఇతర టాప్ స్టార్స్ ఇందులో నటిస్తున్నారు. యూవి క్రియేషన్స్ తో పాటు గోపికృష్ణ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతుంది.