Begin typing your search above and press return to search.

ప్రభాస్ ‘రాధే శ్యాం’ టీజర్ రిలీజ్ అప్పుడే!

By:  Tupaki Desk   |   10 Jan 2021 11:00 PM IST
ప్రభాస్ ‘రాధే శ్యాం’ టీజర్ రిలీజ్ అప్పుడే!
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్.’ ఈ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే.. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకూ ఒకటీ అరా లుక్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. దీంతో.. టీజర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా? అని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

టీజర్ త్వరలోనే వస్తోంది అన్నట్టుగా దర్శకుడు రాధాకృష్ణ న్యూ ఇయర్ సందర్భంగా హింట్ ఇచ్చారు. దీంతో.. మోస్ట్ అవైటెడ్ రాధే శ్యామ్ టీజర్ కొత్త సంవత్సరం రోజునే వస్తోందని ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. కానీ.. వారి ఆశ నెరవేరలేదు.

పాన్ ఇండియన్ లెవెల్లో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్రం టీజర్ కోసమే అంతా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణను జరుపుకుంటున్న ఈ చిత్రం.. త్వరలోనే పూర్తి కానుంది. అయితే.. ఈ భారీ చిత్రాన్ని జనవరి మూడోవారం లేదా అంతకు ముందే పూర్తి చేయాలన్న పట్టుదలతో యూనిట్ ఉందని తెలుస్తోంది. ప్రభాస్ కూడా ఈ ప్రాజెక్టును త్వరగా ఫినిష్ చేసి - నెక్స్ట్ ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టాలని చూస్తున్నాడు.

అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ టీజర్ ను సంక్రాంతి కానుకగా ఈ నెల 14న రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు.