Begin typing your search above and press return to search.
'ఆదిపురుష్ 3డి' టీమ్ కి ప్రభాస్ కానుకలు
By: Tupaki Desk | 15 Dec 2021 11:01 AM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దయార్థ్ర హృదయం గురించి.. క్వాలిటీ ఆతిథ్యం గురించి చెప్పాల్సిన పనే లేదు. అతడు తన సహనటీనటులతో ఎంతో ఉదారంగా ప్రేమగా వ్యవహరిస్తారు.
కష్టంలో ఉంటే ఆదుకోవడమే కాదు.. తన టీమ్ ని సంతోషపరిచేందుకు అరుదైన కానుకల్ని కూడా ఇస్తుంటారు. ఇక కథానాయికలకు అయితే ప్రత్యేకించి లంచ్ బాక్సులు క్యారేజీలు అందుతుంటాయి. సీనియర్ నటీమణులకు ప్రత్యేకించి సదుపాయాల్ని ఏర్పాటు చేస్తారు. అందుకే అందరికీ అతడు డార్లింగ్ అయ్యాడు.
ఇప్పుడు ఆదిపురుష్ 3డి టీమ్ పంట పండింది. ఈ టీమ్ లో పని చేసిన ప్రతి ఒక్కరికీ అత్యంత ఖరీదైన ర్యాడో వాచ్ లు అందాయని తెలిసింది. తన చిత్ర బృందానికి ఖరీదైన బహుమతులను అందించి తన మంచితనాన్ని మరోసారి నిరూపించుకున్నాడు. తన తొలి బాలీవుడ్ చిత్రం ఆదిపురుష్ షూటింగ్ ను ఇప్పటికే ప్రభాస్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రభాస్ అత్యంత ఖరీదైన రాడో రిస్ట్ వాచీలను ఆదిపురుష్ సిబ్బందికి బహుమతిగా ఇచ్చాడు. ఒక సాంకేతిక నిపుణుడు ప్రభాస్ అందించిన వాచ్ గిఫ్ట్ ని .. అతను ఉన్న ఫోటోలను పోస్ట్ చేశాడు. అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నెటిజనులు ప్రభాస్ ని అభినందిస్తున్నారు. జనవరిలో రాధే శ్యామ్ మొత్తం సిబ్బందికి కూడా ప్రభాస్ అరుదైన కానుకల్ని అందించిన సంగతి తెలిసిందే. తదుపరి సలార్ టీమ్ కి ఇలాంటి రేర్ గిఫ్ట్స్ అందనున్నాయి.
ప్రభాస్ ఈ మూడు సినిమాలతో పాటు మరో మూడు చిత్రాల్ని క్యూలో పెట్టిన సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ -కె షూటింగ్ జరుగుతోంది. దీపిక కూడా ఇటీవలే టీమ్ లో చేరింది. తదుపరి సందీప్ వంగాతో `స్పిరిట్` అనే భారీ పాన్ ఇండియా చిత్రానికి ప్రభాస్ సన్నాహకాల్లో ఉన్న సంగతి తెలిసిందే.
రాధేశ్యామ్ అతడి రేంజు పెంచే మూవీ!
`బాహుబలి` ఫ్రాంఛైజీ అసాధారణ విజయం ఒక గొప్ప పాన్ ఇండియా స్టార్ ని ఆవిష్కరించింది. టాలీవుడ్ హీరో ప్రభాస్ పాన్ ఇండియా రేంజును మించి పాన్ వరల్డ్ స్టార్ గా అవతరించారు. ఒక్క సక్సెస్ డార్లింగ్ ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసింది. స్టార్ డమ్ ని ఎక్కడికో తీసుకెళ్లింది. దేశ..విదేశాల్లో ప్రభాస్ అంటే తెలియని అభిమాని లేడు. భారతదేశంతో పాటు చైనా..జపాన్..థాయ్ లాండ్.. కొరియన్ దేశాల్లో సైతం డార్లింగ్ కి అభిమానులు ఏర్పడ్డారంటే `బాహుబలి` తనని ఏ స్థాయికి చేర్చిందో చెప్పొచ్చు.
దక్షిణాదిన అంతటి ఛరిష్మా కేవలం సూపర్ స్టార్ రజనీకాంత్...కమల్ హాసన్ లాంటి వాళ్లకే సొంతం. బాలీవుడ్ లో అమీర్ ఖాన్..షారుక్ ఖాన్..హృతిక్ రోషన్ లాంటి దిగ్గజ నటులకు ఆ రేంజుంది. అయితే డార్లింగ్ ఇప్పుడు వాళ్లందరినీ వెనక్కి నెట్టేసారన్న టాక్ జాతీయ మీడియాలోనే వైరల్ గా మారింది.
పారితోషికం అందుకోవడంలో కానీ.. ఎంపిక చేసుకున్న ప్రాజెక్టుల్లో కానీ.. యూత్ లో క్రేజ్ పరంగా కానీ.. ప్రభాస్ హిందీ నటుల్నే తలదన్ని ముందుకు సాగిపోతున్నారని విశ్లేషణలు ఊపందుకున్నాయి. ఖాన్ లకే సాధ్యం కానిది సాధ్యం చేసి చూపిస్తున్నాడు ప్రభాస్.
బాలీవుడ్ హీరోల్ని మించిన క్వాలిటీస్ ప్రభాస్ లో ఉన్నాయన్నది ప్రధానంగా హైలైట్ అవుతోంది. హైట్..వెయిట్..గ్లామర్ ఇలా ప్రతీ అంశంలోనూ డార్లింగ్ వాళ్లందరికంటే ఒక మెట్టు పైనే ఉన్నారన్న ముచ్చట సాగుతోంది. ప్రభాస్ ఇతరుల్ని వెనక్కి నెట్టి నంబర్ వన్ స్థానంలో ఉన్నారని విశ్లేషణలు సాగుతున్నాయి.
ప్రభాస్ నటించిన కొత్త సినిమా `రాధేశ్యామ్` పాన్ ఇండియాలో కేటగిరిలో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. 2022 సంక్రాంతికి ఈ మూవీ విడుదలవుతోంది. ప్రభాస్ కి సాహో తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు రాధేశ్యామ్ తో సంచలనాలు సృష్టించి తన రేంజును మరోసారి చాటుకోవాలని ప్రభాస్ తపిస్తున్నారు.