Begin typing your search above and press return to search.

వాళ్లు బాహుబలిని వదలడం లేదు

By:  Tupaki Desk   |   25 Sept 2016 10:13 AM IST
వాళ్లు బాహుబలిని వదలడం లేదు
X
బాహుబలి మూవీ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ కి నేషనల్ లెవెల్ లో క్రేజ్ వచ్చేసిన సంగతి తెలిసిందే. కార్పొరేట్ వర్గాల్లో కూడా ప్రభాస్ హాట్ టాపిక్ అయిపోయాడు. ముఖ్యంగా మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా అయితే.. బాహుబలిలో ప్రభాస్ ను చూసి విపరీతంగా ఇష్టపడ్డారట. అందుకే వెంటనే ఓ ఎస్యూవీకి ప్రభాస్ తో ప్రచారం చేసేందుకు ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. ఇప్పటికే ఆ యాడ్ టీవీల్లో కూడా వచ్చేసింది.

ఇప్పుడు మళ్లీ ప్రభాస్ తో షూటింగ్ చేస్తున్నారట మహీంద్రా టీం. మొదటిసారి తీసిన ప్రకటనకు మించి.. ఈ యాడ్ ను షూట్ చేస్తున్నారని.. ఓ మినీ మూవీ రేంజ్ లో ఈ కమర్షియల్ ఉండనుందని తెలుస్తోంది. పైగా ప్రభాస్ ను నమ్మి యాడ్ షూటింగ్ కు కూడా భారీ బడ్జెట్ కేటాయించారట. ఇప్పటికే ఈ ప్రకటన పిక్చరైజేషన్ ఫినిషింగ్ దశకు చేరుకోగా.. ఇప్పుడు ఆ గెటప్ లో చేసిన ఫోటో షూట్ మాత్రం బయటకు వచ్చింది.

బాహుబలి2 రిలీజ్ అయ్యాక.. ప్రభాస్ నేషనల్ స్టార్ అయిపోతాడనే టాక్ గట్టిగానే ఉంది. దీనికి తోడు సాక్షాత్తూ గ్రూప్ ఛైర్మన్ కి ప్రభాస్ బాగా నచ్చేయడంతో.. బాహుబలిని ఇప్పట్లో వదిలే సమస్యే లేదని తెలుస్తోంది. పైగా వచ్చే ఏడాది బాహుబలి2 రిలీజ్ అయ్యాక ఈ క్రేజ్ మరింతగా పెరుగుతుంది కాబట్టి.. వ్యాపారపరంగానూ ప్రభాస్ తో కమర్షియల్ బాగానే వర్కవుట్ అవుతుందని అంచనాలు వేసుకున్నారట.