Begin typing your search above and press return to search.

ప్రభాస్ సొంత బ్యానర్..ఓటీటీలతో హోరు!

By:  Tupaki Desk   |   15 May 2021 8:00 AM IST
ప్రభాస్ సొంత బ్యానర్..ఓటీటీలతో హోరు!
X
కరోనా వేళ ఓటీటిలకు ఊపొచ్చింది. పెద్ద సినిమాలు చేస్తూంటే డబ్బు బ్లాక్ అయ్యిపోతోంది. రొటేషన్ ఆగిపోతోంది. రిలీజ్ డేట్స్ కోసం వెయిట్ చెయ్యాల్సి వస్తోంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పెద్ద బ్యానర్స్ ..ఓటీటి ల వైపు తన దృష్టిని తిప్పుతున్నాయి. అదే పద్దతిలో ప్రభాస్ సొంత సంస్ద అయిన 'యువి క్రియేషన్స్' కూడా వరసపెట్టి ఓటీటి సినిమాలకు ప్లాన్ చేసిందని సమాచారం. ఓ ప్రక్కన ప్రభాస్ తో రాధేశ్యామ్ వంటి భారీ సినిమా చేస్తున్న ఈ బ్యానర్ ..చిన్న సినిమాలపై వర్క్ చేస్తోంది. తనకున్న ట్రాక్ రికార్డును పక్కన పెట్టి, వరుసగా చిన్న సినిమాలు ప్లాన్ చేస్తూంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. అందుకు కారణం ఏమిటా అని అన్వేషిస్తున్నారు.

భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయిన యువీ క్రియేషన్స్, మధ్య మధ్యలో రన్ రాజా రన్ వంటి చిన్న సినిమాలు ప్లాన్ చేసుకుంటూ వస్తోంది. అయితే ఇప్పుడు జోరు పెంచింది. దాంతో ప్రస్తుతం యువీ నుండి ఐదు చిన్న చిత్రాలు రాబోతున్నాయి. అందుకు కారణం బిజినెస్ లో మారుతున్న పరిస్థితులకు తగ్గట్లు ఈక్వేషన్లు సరి చూసుకోవటమే అంటున్నారు. ఓ పెద్ద సినిమాకు మరో రెండు చిన్న సినిమాలు ప్యాకేజీగా అంటగడుతూంటారు సాధారణంగా పెద్ద బ్యానర్స్. వాటిలోనే డబ్బులు మిగిలుతాయి. ఇదే పద్దతిని యువీ క్రియేషన్స్ సంస్థ పర్ఫెక్ట్ గా ఫాలో అవుతోంది. అయితే ఇప్పుడు హఠాత్తుగా చిన్న సినిమాల జోరు పెంచేయటానికి కారణం ..ఓటీటినే అంటున్నారు.

ఈ క్రమంలో సినిమా ఇండస్ట్రీలో ఆపర్స్ కోసం తిరిగే వారికి 'యువి క్రియేషన్స్' ఇప్పుడు కల్పతరువులా కనిపిస్తోంది. మంచి కథతో వెళ్లి ఒప్పిస్తే డైరక్షన్ ఛాన్స్ ఇస్తున్నారట. దాంతో చాలా మంది యంగ్ బ్యాచ్ డైరక్ట్ గా యువి క్రియేషన్స్ బ్యానర్ ని డైరెక్ట్ గా ఎప్రోచ్ అవుతున్నారు.

ఇత ఇప్పటికే దర్శకుడు శోభన్ కుమారుడు సంతోష్ తో మినీ కథ అంటూ ఒక బోల్డ్ సినిమాను ప్రేక్షుకుల ముందుకు తీసుకొస్తోన్న యువీ క్రియేషన్స్, ప్రశాంత్ అనే కొత్త దర్శకుడితో మరో సినిమాని కూడా ఆల్ రెడీ స్టార్ట్ చేసింది. ఇవి కాక దాదాపు అరడజనుకు పైగా చిన్న కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇవన్నీ కూడా చిన్న చిత్రాలే కావడం చెప్పుకోదగ్గ విషయం.