Begin typing your search above and press return to search.

ఏషియన్‌ టాప్‌ సెలబ్రెటీల జాబితాలో మనోడు

By:  Tupaki Desk   |   10 Dec 2020 11:04 AM IST
ఏషియన్‌ టాప్‌ సెలబ్రెటీల జాబితాలో మనోడు
X
ప్రభాస్‌ అంటే ఇప్పుడు తెలుగు హీరో మాత్రమే కాదు. మొన్నటి వరకు ఆల్‌ ఇండియా స్టార్‌ గా పేరు దక్కించుకున్న ప్రభాస్‌ ఇప్పుడు ఏకంగా ప్రపంచ ప్రసిద్ది గాంచిన స్టార్స్‌ జాబితాలో చేరిపోయాడు. బాహుబలి.. సాహో సినిమాలతో పలు దేశాల్లో ప్రభాస్‌ కు విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగి పోయింది. అందుకే ఏషియన్‌ సెలబ్రెటీల్లో అత్యధిక ప్రేక్షకాధరణ ఉన్న నటుడిగా ప్రభాస్‌ టాప్‌ 10 లో నిలిచాడు. ప్రముఖ యూకే మ్యాగజైన్‌ నిర్వహించిన సర్వేలో మనోడు ప్రభాస్‌ ఏకంగా 7వ స్థానంలో నిలిచి ది గ్రేట్‌ అనిపించుకున్నాడు.

2020లో అత్యధిక ప్రేక్షకాధరణ పొందిన ఏషియన్‌ సెలబ్రటీల జాబితాను విడుదల చేయగా అందులో నెం.1 గా సోనూసూద్‌ నిలిచాడు. కరోనా లాక్‌ డౌన్‌ సమయంలో రియల్‌ హీరోగా నిలిచిన సోనూసూద్‌ కు కళ్లు మూసుకుని ఓట్లు గుద్దేశారు జనాలు. ప్రభాస్‌ కు సాహో సినిమా కారణంగా మంచి పేరు వచ్చింది. అందుకే 7వ స్థానంలో నిలిచాడు. యూనివర్శిల్‌ హీరోయిన్‌ గా పేరు దక్కించుకున్న మన ఇండియన్ హీరోయిన్‌ ప్రియాంక చోప్రాకు నెం.6 స్థానం దక్కింది. ఆమె తదుపరి స్థానం మన ప్రభాస్‌ కు దక్కింది. ఇది ప్రభాస్‌ అభిమానులకు మాత్రమే కాకుండా మొత్తం సౌత్‌ ఇండియన్‌ సినీ ప్రేక్షకులకు గర్వకారణం అనడంలో సందేహం లేదు.