Begin typing your search above and press return to search.
మహేష్ డేట్ పై ప్రభాస్ కన్ను..?
By: Tupaki Desk | 5 Nov 2022 11:00 PM ISTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పౌరాణిక చిత్రం ''ఆదిపురుష్''. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావించారు. జనవరి 12న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు అప్పుడెప్పుడో డేట్ కూడా అనౌన్స్ చేసారు. అయితే ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయాయి.
'ఆదిపురుష్' చిత్రాన్ని పొంగల్ రేసు నుంచి తప్పిస్తున్నారని టాక్ నడుస్తోంది. బాక్సాఫీస్ క్లాష్ ని నివారించడానికో లేదా టీజర్ పై వచ్చిన ట్రోల్స్ కారణంగానో.. మరేదైనా ఇతర కారణాల వల్లనో తెలియదు కానీ.. ప్రభాస్ సినిమా పెద్ద పండక్కి రావడం లేదని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు వాయిదా వేస్తే మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేస్తారనే దానిపై చర్చలు జరుగుతున్నాయి.
సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా 'ఆదిపురుష్' ను శ్రీరామ నవమి కానుకగా మార్చి నెలాఖరున విడుదల చేసే అవకాశం ఉందని టాక్ వచ్చింది. కాకపోతే మార్చి 30న నాని నటించిన పాన్ ఇండియా మూవీ 'దసరా' సినిమా కోసం చాలా రోజుల క్రితమే బ్లాక్ చేసుకున్నారు. అదే వారంలో మరికొన్ని బాలీవుడ్ సినిమాలు వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో ఇప్పుడు 2023 సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ లేదా మే నెలలో రావాలని చూస్తున్నట్లు టాక్ వచ్చింది.
ఇందులో భాగంగా ప్రభాస్ సినిమా కోసం వచ్చే ఏప్రిల్ 28న తేదీని పరిశీలిస్తున్నారని అంటున్నారు. అయితే డేట్ ని లక్ష్యంగా చేసుకొని SSMB28 సినిమా వస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ఈ చిత్రాన్ని 2023 ఏప్రిల్ 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. కానీ ఇప్పుడు షూటింగ్ ఆలస్యం కావడంతో అనుకున్న సమయానికి రాకపోవచ్చనే అనుమానం కలుగుతోంది.
ఈ నేపథ్యంలో మహేష్ డేట్ పై ప్రభాస్ కన్నేసినట్లుగా టాక్ నడుస్తోంది. కాకపోతే అప్పుడు కూడా 'ఆది పురుష్' కు సోలో రిలీజ్ దొరికే పరిస్థితి లేదు. ఎందుకంటే అప్పుడు లెజండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న 'పొన్నియిన్ సెల్వన్: 2' లేదా రజనీకాంత్ నటిస్తున్న 'జైలర్' సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు చిత్రాలలో ఒకటి తమిళ్ న్యూ ఇయర్ కానుకగా ఏప్రిల్ 14న వస్తే.. మరొకటి రెండు వారాల తర్వాత ఏప్రిల్ 28న రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఎక్కువ శాతం 'పొన్నియిన్ సెల్వన్' రెండో భాగం రావచ్చని అంటున్నారు. వీటిల్లో ఏది వచ్చినా ప్రభాస్ సినిమాకు పెద్దగా ఇబ్బంది లేకపోవచ్చు. ఒక్క తమిళ్ మినహా మిగతా భాషల్లో సాధారణ పోటీగానే భావించారు. స్ట్రెయిట్ హిందీ సినిమా కాబట్టి.. 'ఆదిపురుష్' కు నార్త్ మార్కెట్ లో మంచి హైప్ ఉంటుంది. ఎన్ని ట్రోల్స్ వచ్చినా తెలుగులో ఎలాగూ డార్లింగ్ క్రేజ్ పని చేస్తుంది.
కాకపోతే మహేష్ బాబు ఆ డేట్ వదులుకుంటాడా లేదా? అనేదే ప్రశ్నార్థంగా మారింది. ఒకవేళ త్రివిక్రమ్ శరవేగంగా షూటింగ్ జరిపి ఏప్రిల్ 28వ తేదీకి రాగలమని భావిస్తే మాత్రం.. 'ఆదిపురుష్' కోసం మరో స్లాట్ వెతుక్కోవాల్సి ఉంటుంది. మరి చివరకు ప్రభాస్ సినిమాకి ఎలాంటి డేట్ దొరుకుంటుందో.. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.
కాగా, 'ఆదిపురుష్' చిత్రాన్ని రామాయణం ఆధారంగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొందిస్తున్నారు. ఇందులో రాముడిగా ప్రభాస్ నటిస్తే.. సీతగా కృతి సనన్ - రావణ్ గా సైఫ్ అలీఖాన్ కనిపించనున్నారు. టీ-సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించారు. పాన్ ఇండియా స్థాయిలో 3డీ మరియు ఐమాక్స్ ఫార్మాట్ లో ఈ సినిమా విడుదల కాబోతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.